Chamakura Malla Reddy: మస్త్ పరేషాన్‌లో మల్లన్న.. పార్టీ మారుతారా?

Chamakura Malla Reddy Political Story: మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొన్ని రోజుల నుంచి సైలెంట్‌ అయ్యారు. త్వరలోనే పార్టీ మారాలని చూస్తున్నారని సమాచారం. నిజానికి మల్లారెడ్డి ఏ పార్టీలోకి వెళ్లబోతున్నాడు. అసలు ఇంత సైలెంట్‌ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Aug 30, 2024, 01:19 PM IST
Chamakura Malla Reddy: మస్త్ పరేషాన్‌లో మల్లన్న.. పార్టీ మారుతారా?

 

Chamakura Malla Reddy Political Story: ఆయన పక్కా మాస్ లీడర్. సొంత పార్టీ నేతలను పొగడాలన్నా..పక్క పార్టీ నేతలను తిట్టాలన్నా ఆయన స్టైలే వేరు. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆయన హల్ చల్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు అధికారం పోవడంతో ఆ మాజీ మంత్రి పూర్తిగా సైలెంట్ అయ్యారట. అధికార పార్టీలోకి జంప్ అవుదామని చూస్తున్నా వాళ్లు డోర్లు ఓపెన్ చేయడం లేదట. పోనీ కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి పోదామంటే అక్కడ కూడా వర్కవుట్ కావడం లేదట. ఇప్పుడు ఉన్న పార్టీలో ఉండలేక ..ఏ పార్టీలోకి వెళ్లాలా అని తెగ ఆలోచిస్తున్నాడట. ఇంతకీ ఆ మాస్ లీడర్ ఎవరు...? ఆయన ఎందుకు పరేషాన్ అవుతున్నాడు..

చామకూర మల్లారెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు. పాలిటిక్స్ లో ఆయన స్టైలే డిఫరెంట్. మిగితా నాయకులకు కొంత భిన్నంగా తన వ్యవహార శైలి ఉంటుంది. ఆయన స్పీచ్ ఇస్తుంటే నవ్వులే నవ్వులు. స్టేజీ మీద ఎవరూ ఉన్నా పట్టించుకోరు. తాను చెప్పాల్సుకుంది చెబుతుంటారు. ఒక రకంగా ఆయన వాగ్ధాటితోనే ఇటు జనాలను, అటు లీడర్లను ఆకట్టుకుంటారనేది టాక్. పాలమ్మినా , పూలమ్మినా కష్టపడినా ఫేమస్ ఐనా అని చాలా వేదికల్లో మల్లారెడ్డి అదరగొడుతుండే..అలాంటి మల్లారెడ్డికి గత కొద్ది నెలలుగా తన పాత స్టైల్ కు భిన్నంగా ఉంటున్నారట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగినా హల్ చల్ చేసేవారు. పుల్ జోష్ లో ఉండేవారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు పూర్తిగా డల్ అయ్యారని మల్లారెడ్డి అనచరులే చెప్పుకుంటున్నారు. మా మల్లారెడ్డి సార్ అప్పట్లో మస్త్ హవా చూపించేటోడు. ఇప్పుడు కామ్ గా అయిపోయిండు. మాకు ఇది ఏ మాత్రం నచ్చట్లే అని మల్లారెడ్డి ఫాలోవర్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే మల్లా రెడ్డి సైలెన్స్ వెనుక ఉన్న కారణాలేంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఒకటైతే...తన ఆస్తుల పై వరుసగా జరుగుతున్న దాడులు మల్లారెడ్డిని పెద్ద టెన్షన్ పెడుతున్నాయట. ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీకీ సంబంధించిన కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా మరి కొన్నింటిని కూల్చడానికి అధికారులు సిద్దపడుతున్నారట. ఏళ్లుగా విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు కష్టాలు వస్తుండడంతో మల్లన్న ఆందోళన చెందుతున్నారట.  కేవలం మల్లారెడ్డికి సంబంధించినవే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వాటికి కూడా నోటీసులు వస్తున్నాయట దీంతో ఏం చేయాలో తోచక మల్లన్న మస్త్ పరేషాన్ అవుతున్నారట.

ఈ సమస్యలను గట్టెక్కాలంటే పార్టీ మారడమే సరైందని మల్లారెడ్డి అనుకున్నారట కానీ ఆయనకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. అధికార కాంగ్రెస్ లో చేరుదామని మల్లారెడ్డి భావించినా ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదట. మల్లారెడ్డి రాకనే హైదరాబాద్ పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారట. మరీ ముఖ్యంగా మైనంపల్లి హన్మంతరావు మల్లారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి రానిచ్చే పరిస్థితి లేదని భీష్మించి కూర్చున్నారట. దీంతో కాంగ్రెస్ లో మల్లారెడ్డి ఎంట్రీకీ డోర్లు క్లోజ్ అయ్యాయి. కాంగ్రెస్ లో అవకాశం లేకపోవడంతో మరో ఆలోచన మల్లారెడ్డి చేశారట. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నందున బీజేపీకీ వెళితే కనీసం తమ వ్యాపారాలకైనా ఇబ్బంది ఉండదని ప్లాన్ చేశారు  కానీ అది కూడా మల్లారెడ్డికి వర్కవుట్ కాలేదు. ఢిల్లీలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పార్టీలకు చెందిన పెద్దలతో రాయబారం నడిపినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందట. దీంతో మల్లారెడ్డి మరింత ఆందోళనకు గురువుతున్నారట. 

అసలే హైడ్రా పేరుతో హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు బుసలు కొడుతున్నాయి. ఈ బుల్డోజర్లు తన వరకు వస్తే పరిస్థితి ఏంటా అని మల్లారెడ్డి దిగులు చెందుతున్నారట. ఇప్పటికే తన జోలికి రాకుండా చూడాలని తనకు తెలిసిన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డికి రాయబారం పంపుతున్నారట. అయితే ఇది వర్కవుట్ అవుతుందో లేదో అని మల్లన్ననే దిగులు చెందుతున్నారట. ఇది ఇలా ఉంటే  మల్లారెడ్డికి ఒక కొత్త ఆలోచన వచ్చిందంట. కాంగ్రెస్, బీజేపీ కాదంటే ఏంటి..టీడీపీ ఉందిగా అని అనుకుంటున్నారట. గతంలో తాను టీడీపీ మనిషినే కదా మళ్లీ ఆపార్టీలోకి పోతే ఎలా ఉంటుందో తన సన్నిహితులతో ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రపోజల్ పంపినట్లు గుస గుసలు వినపడుతున్నాయి. 

తనకు తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీకీ ఊపుతెస్తానని మల్లన్న అంటున్నారట. పార్టీనీ మరింత ప్రజల్లోకి తీసుకెళుతానని త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుండడంతో హైదరాబాద్ నుంచే పార్టీకీ ఊపు తెస్తానని బాబుకు తన దూత ద్వారా కబురు పంపారట. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చలేదట. త్వరలో టీడీపీ అధ్యక్షుడి నియామకం ఉంటున్న దరిమిలా మల్లారెడ్డి తన ప్రయత్నాలను మరింత స్పీడప్ చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను పొలిటికల్ గా సేఫ్ గా ఉండాలంటే తనకు ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ పార్టీనని. టీడీపీలోకి వెళ్లడమే సరైందిగా మల్లారెడ్డి భావిస్తున్నారట. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కూడా మల్లారెడ్డి కలిసే ప్రయత్నం చేశారని టాక్. ఆ తర్వాతనే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఆ ఎమ్మెల్యే మల్లారెడ్డినా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతుంది.

మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో హంగామా చేసిన మల్లారెడ్డి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే సరికి ఏ మాత్రం తోచడం లేదట. అర్జెంట్ గా కండువా మార్చాలని తెగ ఆరాట పడుతున్నారట కానీ మల్లన్నను పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం పార్టీలో అస్సలు ఆసక్తి చూపడం లేదట. దీంతో మల్లన్న పరేషాన్ అవుతున్నారట. భవిష్యత్తులోనైనా మల్లన్నకు పార్టీ మారే అవకాశం దొరుకుతుందా లేక ఇప్పుడు ఉన్న పార్టీలోనే కొనసాగుతార అనేది  కాలమే తేల్చాలి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News