ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ !!

ప్రధాని మోడీ ఈ రోజు తన ఇరవై ఏళ్ల నాటి జ్ఞాపకాలను జనాలతో పంచుకున్నారు

Last Updated : Jul 26, 2019, 02:27 PM IST
ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ !!

ఢిల్లీ: ప్రధాని మోడీ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? .. వాస్తవానికి ఇది సాధ్యం కాకపోయినా....జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సాధ్యమే కదా మరి.. !! సరిగ్గా ప్రధాని మోడీ ఇదే చేశారు...ఇంతకీ మోడీ 20 ఏళ్ల వెనక్కి వెళ్లడానికి కారణం ఏమై ఉంటది..అని ఆలోచిస్తున్నారా ?  క్లారిటీ కావాలంటే వివరాల్లోకి వెళ్లండి మరి !!

ప్రధాని మోడీ 20 ఏళ్ల క్రితం జరిగిన  కార్గిల్ యుద్ధం నాటి సైన్యంతో కలిసిన తన  జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా జనాలతో పంచుకున్నారు. ఈ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడానికి కారణం లేకపోలేదు. భారత్ పై దురాక్రమణకు ప్రయత్నించి... కార్గిల్, ద్రాస్ సెక్టర్లలో చొరబడి యుద్ధానికి దిగిన పాక్ సైన్యం తోకముడిచిన వార్ జరిగి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా  ప్రధాని అప్పటి పాస్ట్ ఈవెంట్స్ ను ఇలా  గుర్తుచేసుకున్నారు. 

కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన భారత సైనికుల జ్ఞాపకార్థం జరుపుకునే  విజయ్ దివస్ సందర్భంగా న్యూ ఢిల్లీలోని అమర వీరుల స్మారకం వద్ద  ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భారత సైనికుల్లోని ధైర్యం, సాహసాలను విజయ్ దివస్ గుర్తు చేస్తుందన్నారు.  దేశం కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడి.. వీరమరణం పొందిన సైనికులకు  తాను సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో తాను జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నానని.. ఆ సమయంలోనే భారత సైన్యాన్ని కలిశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అప్పట్లో సైనికులతో తాను దిగిన ఫోటోలను పంచుకున్నారు.

 

 

Trending News