IPL 2025 Mega Auction: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలపాలైన టీమ్ ఇండియా ఆటగాడు రిషభ్ పంత్ ఎట్టకేలకు తిరిగి ఇండియన్ టెస్ట్ టీమ్‌లో ఎంట్రీ ఇచ్చేశాడు. త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ ఏడాదిలో తిరిగి క్రికెట్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిలో పడ్డాడు.
ఎంఎస్ ధోని తరువాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సరైన కెప్టెన్ కరువయ్యాడు. మధ్యలో కొద్దికాలం రవీంద్ర జడేజా కెప్టెన్సీ వహించి చేతులెత్తేస్తే తిరిగి ధోని ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోని తాను తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు. అయితే గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. జట్టు కూడా అడపా దడపా రాణించింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రిషభ్ పంత్‌పై కన్నేసింది. ఐపీఎల్ 2025లో అతనిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎంఎస్ ధోనికి వీరాభిమాని అయిన రిషభ్ పంత్ అతని సలహాలతో సీఎస్కే శిబిరాన్ని నడిపే పరిస్థితి కన్పిస్తోంది.
అదే జరిగితే రుతురాజ్ గైక్వైడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవల్సి వస్తుంది. సీఎస్కే యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్‌ను కేవలం కెప్టెన్సీ నుంచే తప్పిస్తుందా లేక జట్టు నుంచి రిలీజ్ చేస్తుందా అనేది ఇంకా తెలియదు. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు టైటిల్ సాధించలేకపోయినా పైనల్ వరకు చేరగలిగింది.
ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ జట్టు కూడా జట్టు మొత్తం మార్పుుల చేసేందుకు యోచిస్తోంది. కేవలం 1 లేదా 2 రిటెన్షన్లనే అనుమతించాలని యాజమాన్యం బీసీసీఐని కోరింది. బీసీసీఐ ఈ విషయమై నిర్ణయం తీసుకోవల్సి ఉంది. కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం ఒకవేళ సీఎస్కే ఎంఎస్ ధోనిని రిటైన్ చేసుకోలేకపోతే కచ్చితంగా రిషభ్ పంత్‌ను తీసుకోవచ్చు. అయితే ఇదంతా బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కొత్త విధి విధానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు యాజమాన్యం కూడా సూర్యకుమార్ యాదవ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Also read: IPL 2025 Mega Auction: SRH, KKR సహా ఈ 5 జట్ల కెప్టెన్లు మారనున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.