ఆర్టికల్ 370: సొంత పార్టీపైనే మండిపడిన కాంగ్రెస్ మాజీ సీఎం

ఆర్టికల్ 370: సొంత పార్టీపైనే మండిపడిన కాంగ్రెస్ మాజీ సీఎం 

Last Updated : Aug 18, 2019, 07:09 PM IST
ఆర్టికల్ 370: సొంత పార్టీపైనే మండిపడిన కాంగ్రెస్ మాజీ సీఎం

చండీఘడ్: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అతిచేస్తున్నారని సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తంచేశారు కాంగ్రెస్ పార్టీకే చెందిన హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రాన్ని అభినందిస్తూ నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆయన ప్రశంసలు గప్పించారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని తప్పకుండా స్వాగతిస్తానని స్పష్టం చేసిన బీఎస్ హుడా.. ఆర్టికల్ 170 రద్దు విషయంలోనూ కేంద్రం మంచి పనే చేసిందన్నారు. దేశభక్తి, ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెబుతూ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. 

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ గాడితప్పి ప్రవర్తిస్తోందని, అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైందో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తంచేస్తూ బిఎస్ హుడా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Trending News