Jio Down: జియో సేవలకు అంతరాయం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..!

Jio Network Outrage: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో జియో సేవలు ఆగిపోయినట్లు డౌన్ డిటెక్టర్ స్పష్టం చేసింది. ఒక గంటలోనే దాదాపు పదివేల మంది జియో వినియోగదారులు జియో సేవలు ఆగిపోయాయని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.  అయితే ఈ విషయంపై అటు జియో నుంచి ఎటువంటి స్పందన లేదా హామీ రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 17, 2024, 02:27 PM IST
Jio Down: జియో సేవలకు అంతరాయం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..!

Jio Network Down: దేశంలోని దిగ్గజ టెలికాం రంగాలలో ఒకటైన జియోకి.. ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కోట్లాదిమంది ప్రజలు జియో సేవలను పొందుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలోని పలు ప్రాంతాలలో రిలయన్స్ జియో సేవలు మరొకసారి నిలిచిపోయాయి . సెప్టెంబర్ 17 మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభం అయింది. జూన్ 2024 లో కూడా ముంబైలో జియో సేవలు నిలిచిపోవడం.. ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికి జియో డౌన్ కావడంతో సోషల్ మీడియాలో వినియోగదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎటువంటి కచ్చితమైన పరిష్కారం కానీ, హామీ కానీ రాకపోవడం గమనార్హం.

 

ఇకపోతే జియో సేవలు ముంబై అంతటా నిలిచిపోయాయని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటూ ఉండగా.. కొన్ని గంటలుగా నెట్వర్క్ సమస్య ఉందని తెలిపారు. అంతరాయాన్ని ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ కూడా జియో అంతరాయాన్ని ధ్రువీకరించినప్పటికీ, ఈ విషయంపై ఎటువంటి స్పందన రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

 

డౌన్ డిటెక్టర్ మ్యాప్ ప్రకారం న్యూఢిల్లీ , లక్నో, కటక్, నాగ్ పూర్, హైదరాబాద్, పాట్నా, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, గౌహతి వంటి ప్రధాన నగరాలలో జియో సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ మహా నగరాలలో కోట్లాదిమంది ప్రజలు జియో సేవలను అందుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్గా జియో సేవలో ఆగిపోవడంతో వినియోగదారులు పూర్తి ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 

 

ఇకపోతే జియో సేవలు నిలిచిపోవడంతో ఒక గంటలోనే పదివేల మందికి పైగా డౌన్ డిటెక్టర్ పై ఫిర్యాదులు చేశారు. సిగ్నల్ లేదని 67% మంది సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు చేయగా,  మొబైల్ ఇంటర్నెట్ పై 20% మంది జియో ఫైబర్ పై మరో 13 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు జియో సేవలు ఆగిపోయాయని సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు. ఇకపోతే దేశంలోని పలు ప్రధాన నగరాలలో ఇలా సడన్గా జియో సేవలు ఆగిపోవడానికి గల ప్రధాన కారణాలు మాత్రం తెలియ రాలేదు. అంతేకాకుండా ఒక వారం నుంచి జియో వాళ్లకి ప్రపంచవ్యాప్తంగా కొన్నిసార్లు కాల్స్ కలవడం లేదు అంటూ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మరి జియో సంస్థ వీటి పైన ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ క్రమంలో ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతున్నా జియో డౌన్ హ్యాష్ ట్యాగ్ పోస్టులను మీరు ఒకసారి చూసేయండి..

 

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే

Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News