YS Jagan Mohan Reddy: ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజు రోజుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరు, ముగ్గరు నేతలు తప్పా మిగితా నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ జరగుతుంది. అయితే ఇది ఇలా ఉంటే కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు ప్రతిపక్షంలో ఉండటానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ఉన్న ఫళంగా పార్టీ మారితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నారట. అందులో ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారాలని ఆలోచిస్తుండడంపై వైసీపీ పెద్దలు ఆశ్చర్యానికి గురవుతున్నారట.అధికారంలో ఉన్నప్పుడు మా జగన్ అన్నా ..మా జగన్ అన్నా నేతలే..ఇప్పుడు పార్టీ మారుతుండడంపై వైసీపీ నేతలు విస్మయానికి గురువుతున్నారట.
Also Read: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ రియాక్షన్ ఇదే.. వైసీపీ సంచలన నిర్ణయం
పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు చాలా మంది నేతలు పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇటీవల జరగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరి నేతల్లో చాలా మార్పు వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతుంది. గత పద్నాలుగు ఏళ్లుగా జగన్ తో నడిచిన నేతలు ఇప్పుడు వారి ఆలోచనలో తేడా కనపడుతుందంట. ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి ఉండి, అందునా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారానుకోవడం పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ కాంగ్రెస్ ను విభేధించి బయటకు వచ్చిన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్ కు వెన్నంటే నిలిచిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ మారాలనుకోవడం ఏంటా అని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. జగన్ ఒక రకంగా సొంత మనుషులుగా ముద్ర ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారుతుండడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో జగన్ ను ఒంటరిని చేసి వెళ్లడం ఎంత వరకు సబబు అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది.
వైసీపీలో ఎందరో నాయకులు ఉన్నా..ముఖ్యంగా బాలినేని,సామినేని ఉదయభాను లాంటి వ్యక్తులు పార్టీ మారడం పట్ల బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ తో వ్యక్తిగతంగా , రాజకీయంగా ఉన్న బంధాన్ని తెంచుకొని పార్టీనీ వీడడం అస్సలు తాము ఊహించుకోలేకపోతున్నామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడని. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశాడని ..ఇవేమీ జగన్ కు కొత్తకాదు అని వైసీపీ క్యాడర్ అనుకుంటుంది. ఐనా మొన్న జరిగిన ఎన్నికలో మెజార్టీ ప్రజలు వైసీపీ పక్షాననే ఉన్నారని ..దానికి మొన్న వచ్చిన 40శాతం ఓటు బ్యాంకే రుజువని వారికి వారే భరోసా చెప్పుకుంటున్నారు. వెరైనా నేతలు వారి స్వార్థం కోసం పార్టీనీ వీడినా పెద్దగా నష్టం లేదని..వైసీపీలో చాలా మంది నేతలు ఉన్నారని క్యాడర్ చర్చించుకుంటోంది.
టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అనేక అమలు కానీ హామీలు ఇచ్చిందని..వాటి అమలు అంత ఈజీ కాదు అప్పుడు జనాలు మళ్లీ జగన్ వైపే చూస్తారనే భరోసాతో వైసీపీ క్యాడర్ ఉంది. ఐతే వైసీపీ క్యాడర్ లో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నిరోజులు సమిష్టిగా ఉంటుందనేది అనుమానమే అని. గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడైనా కూటమిలో చీలిక రావొచ్చని ..అదే జరిగితే వైసీపీకీ మరింత జనాధారణ పెరుగుతుందని వైసీపీ నేతల అంచనా. అందుకే ఇప్పుడే తొందరపడి నేతలు పార్టీనీ వీడవద్దని తమ నేతలకు చెప్పుకువస్తున్నారు.
మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కూడా గతంలో కాకుండా అందరి నేతలను కలుపుకోవాలననే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది నేతలను జగన్ కలువలేకపోయాడని..దానికి జగన్ కోటరీ కారణమనే విమర్శ ఉంది. అలాంటి విమర్శలపై జగన్ ఒక సారి దృష్టి పెట్టి అందరి నేతలను కలుసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుందనేది క్యాడర్ ఆలోచన. జిల్లాల వారిగా అందరి నేతలను పిలిపించుకొని ఒక సారి మాట్లాడి వారిని బుజ్జగించి పార్టీనీ వీడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అభిమానులు , కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మొత్తానికి ప్రస్తుతం పార్టీ వీడుతున్న నేతల విషయంలో వైసీపీ క్యాడర్ చాలా సీరియస్ గా ఉంది. కష్టకాలంలో పార్టీకీ , జగన్ కు అండగా ఉండాల్సిన నేతలు పార్టీ మారడం బాధాకరమంటున్నారు. అందునా జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు పార్టీనీ వీడడం ఎంత వరకు సమంజసమో ఆ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలనే అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.