Laapataa Ladies official indian entry for oscar 2025: తాజాగా ప్రముఖ లేడీ డైరెక్టర్ కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి పలు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా లభించాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఎన్నో రోజుల క్రితమే డైరెక్టర్ కిరణ్ రావ్ ఈ సినిమా ఆస్కారులో నిలవడం తన చిరకాల కోరిక అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇంటర్వ్యూలో భాగంగా కిరణ్ రావు మాట్లాడుతూ.. ‘2025లో ఆస్కార్ అవార్డుల్లో ఇండియా తరఫున అధికారిక ప్రవేశానికి లాపతా లేడీస్ అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నాతో పాటు మా చిత్ర బృందం కూడా ఆశ పడుతోంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్ కి పంపిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను.’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది కిరణ్ రావ్. ఇప్పుడు ఈ మాటలు అక్షరాల నిజం కావడంతో.. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం ఒక్కటే తక్కువ అంటూ అభిమానులు భాషాభావం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2001 కాలపు చిత్రకథ ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటనను ఇతివృతంగా తీసుకొని లాపతా లేడీస్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నీతాన్షి గోయల్, ఛాయా కదమ్, రవి కిషన్, స్పర్శ శ్రీ వాస్తవ, ప్రతిభా రంతా తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలలో ప్రదర్శించడం జరిగింది. సుప్రీంకోర్టు 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ భవనంలో కూడా సి బ్లాక్ లో ఉన్న ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇక ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని మహిళా దర్శకురాలు కిరణ్ రావు దీమా వ్యక్తం చేసినట్లే.. ఇప్పుడు అది నిజమైంది. ఇక ఈ సినిమాకి ఈ అవార్డు వస్తుందా లేదా తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.