Tirumala Laddu Row :తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంట. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ ధార్మిక సంఘాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఇంత ఘోర తప్పిదం చేస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గత వారం పదిరోజులుగా దీనిపై రగడ కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే అసలు లడ్డుఓ కల్తీ నెయ్యి వాడారా వాడలేదా అన్న అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఏపీలోని అధికార ప్రతిపక్షాల మధ్య రోజు పెద్ద మాటల యుద్దమే కొనసాగుతుంది. ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నారు కానీ..అసలు నిజం మాత్రం తేల్చడం లేదు.
తిరుమల లడ్డుకు ఉన్న ప్రత్యేకతనే వేరు. ఆ లడ్డు రుచి ప్రపంచంలో మరే లడ్డుకు ఉందడు. తిరుమల వెళ్లి వచ్చామంటే చాలు లడ్డు ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు..అంత రుచి , అంత పవిత్రత కేవలం తిరుమల లడ్డుకే దక్కుతుంది. అలాంటి తిరుమల లడ్డు ఇప్పుడు ఏపీలో రాజకీయ అంశంగా మారింది. కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతినేలా ఇప్పుడు ఇది రాజకీయంగా మారడం హిందువులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో రాజకీయ నేతల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి అనవసరంగా తిరుపతి వెంకన్నను లాగారు..వాళ్లకు తగిన శాస్తి జరగకమానదు అంటూ భక్తులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఇదే తిరుమల లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల్లో వణుకు పుట్టిస్తుందంట. ఏపీలో చాలా మంది నేతలు వెంకటేశ్వర స్వామిని తమ కులదైవంగా భావిస్తారట. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయనను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నవారు ఎందరో. అలాంటి వారు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారట. తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు వారిని తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఈ వ్యవహారంలో ఏకంగా ఆ దేవదేవుడిని లాగామా అని పొలిటికల్ లీడర్స్ గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఆ కలియుగ దైవానికి కోపం వస్తే మన పరిస్థితి ఏంటి అని తెగ టెన్షన్ పడుతున్నారట.
ఇతర విషయాల్లో మనం ఎన్ని రాజకీయాలు చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు కదా అని అధికార, ప్రతిపక్ష నేతల్లో తీవ్రంగా చర్చ జరగుతుందంట. తిరుమలను అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు ఆ వెంకన్నను దర్శించుకొని తరిస్తుంటారు. ఆయన ప్రసాదం తీసుకొని ఎనలేని సంతోషం పొందుతుంటారు. అలాంటిది ఈ లడ్డు వ్యవహారంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చర్చించుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే అధికార పార్టీలో విచిత్ర వాతావరణం ఉందంట. కొందరు నేతలు తిరుమల లడ్డు విషయంపై మాట్లాడటానికి జంకుతున్నారట. అసలే స్వామి వారికి కోపం వస్తే దాని ప్రభావం తమ కుటుంబం మీద ఏడ పడుతుందో అని తెగ ఆందోళన చెందుతున్నారట. తిరుమల లడ్డు విషయంపై స్పందించడానికి చంద్రబాబు కేబినెట్ లోని కీలక నేతలు కూడా వణికిపోతున్నారట. లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చాక అసలు వీళ్లు మీడియా కంట కనపడడం కూడా తగ్గించారట. తెలిసి తెలిసి ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం ఎందుకు..లడ్డు ఇష్యూపై ఏం మాట్లాడకుండా ఉండటమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారట. మొదట్లో లడ్డు వ్యవహారంపై కూటమి ప్రభుత్వానికి కొంత సానుకూలత వచ్చినా రోజులు గడిచిన కొద్దీ ఏమైనా తేడా కొడుతుందా అన్న అనుమానాలు కూటమి నేతల్లో ఉన్నాయట. అనవసరంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగామా అని నేతలు తెగ ఫీలవుతున్నారట.
ఇక ప్రతిపక్ష పార్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.. తిరుమల లడ్డు వ్యవహారంలో ఏకంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరిద్దరు నేతలు తప్పా మిగితా నేతలు ఎవ్వరూ కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో మాట్లాడటానికి ఇష్టపడడం లేదంట. దానికి కారణాలు అన్వేషిస్తే ..ఆ వెంకటేశ్వర స్వామితో అనవసరంగా రాజకీయాలు చేయడం దేనికి అని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారట. ఇతర అంశాలపై ఏదైనా మాట్లాడుతాం కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం రాజకీయ కోణంలో స్పందించలేమని అధిష్టానానికి ఒపెన్ గానే చెబుతున్నారట. దీంతో జగన్ మోహన్ రెడ్డే నేరుగా రంగంలోకి ఈ విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇలా తిరుమల వ్యవహారంలో ఏపీ రాజకీయ నేతలు తెగ భయపడిపోతున్నారట. అనవసరగా ఎందుకొచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామితో మనం ఆటలాడుతామా..ఆయను ఏం జరిగిందో తెలియదా..ఒక వేళ లడ్డు తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడితే మాత్రం వారిని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వదిలిపెట్టడు అదే సమయంలో రాజకీయ లబ్ది కోసం ఆ తిరుమల వెంకన్నను రాజకీయాల్లోకి లాగితే మాత్రం వారికి భంగపాటు తప్పదు అని ఏకంగా అధికార,ప్రతిపక్ష నేతలే చెప్పుకుంటున్నారట. వీలైనంత వరకు తిరుమల లడ్డు విషయంలో స్పందించకుంటేనే మేలని నేతలు భావిస్తున్నారట. ఎవరు తప్పు చేశారు, ఎవరు కుట్ర చేశారు అనేది ఆ దేవుడికి తెలియదా అనవసరంగా మనం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారట.
మొత్తానికి ఇలా ఏపీ నేతల్లో తిరుమల వ్యవహారం గుబులు రేపుతుందంట. ఈ లడ్డు వ్యవహారం పర్యవసనాలు ఎలాంటి మలుపులు తిరుగుతుంది.ఆ వెంకన్న ఆగ్రహానికి ఎవరు గురి అవుతారు..ఈ వ్యవహారంకు ఎక్కడ పులిస్టాప్ పడుతుందో అనేది మాత్ర ఆ ఏడుకొండవాడికే తెలియాలి.
Also Read: Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్
Also Read: Fish Venkat: ఆర్ధిక ఇబ్బందులో నటుడు ఫిష్ వెంకట్.. సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter