OTT Movies: హార్రర్, యాక్షన్, లవ్, థ్రిల్లర్, మిస్టరీ ఇలా వివిధ రకాల కంటెంట్ కలిగిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంలో ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ ప్రత్యేకంగా ఉంటోంది. ఇప్పుడు దసరా సెలవుల నేపధ్యంలో వీక్షకుల్ని మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. రానున్న దసరా సెలవుల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇలా..
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో బాలీవుడ్ నటి అనన్య పాండే నటించిన థ్రిల్లర్ సినిమా సీటీఆర్ఎల్ అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 18న ఫ్యాబ్యులస్ లైన్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 25న దో పత్తి సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇక నవంబర్ నెలలో వరుసగా చాలా సినిమాలున్నాయి నవంబర్ 29న సేనా స్ట్రీమింగ్ కానుంది.
దక్షిణాదిన సూపర్ హిట్ సినిమా ఆకాశమే నీ హద్దురా రీమేక్ హిందీలో సర్ఫేరా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం సినిమా వాళై కూడా ఇదే రోజున స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 7వ తేదీన యువర్ ఫ్రెండ్లీ నైబర్ హుడ్ స్పైడర్ మ్యాన్ స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ది సిగ్నేచర్ సినిమా జీ5లో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 4 నుంచి ది ట్రైబ్, నవంబర్ 7 నుంచి సిటాడెల్ హనీ బన్నీ స్ట్రీమింగ్ కానున్నాయి. జియోలో రొమాంటిక్ సినిమా అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ స్ట్రీమింగ్ అవనుంది.
ఇక సోనీలివ్‌లో అక్టోబర్ 4 నుంచి మన్వత్ మర్డర్స్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 11 నుంచి రాత్ జవానీ హై, జై మహేంద్రన్ విడుదల కానున్నాయి. ఇప్పటికే సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బెంచ్ లైఫ్ వెబ్‌సిరీస్, తలావన్ సినిమా, తనావ్ 2 వెబ్‌సిరీస్, బృంద వెబ్‌సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధి 2 సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. బాలు గాని టాకీస్ మరో కామెడీ సినిమా త్వరలో విడుదల కానుంది.
Also read: Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.