Attitude Star Chandrahas: 'రామ్ నగర్ బన్నీ'లో ఆ సీన్స్ తొలగించాం.. ఎందుకంటే: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Ramnagar Bunny Movie: రామ్ నగర్ బన్నీ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. శుక్రవారం ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనున్న నేపథ్యంలో చంద్రహాస్ మీడియాతో మాట్లాడాడు. ఈ సినిమాలో ముద్దు సీన్స్ సెన్సార్ కట్‌లో తొలగించామన్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 3, 2024, 06:37 PM IST
Attitude Star Chandrahas: 'రామ్ నగర్ బన్నీ'లో ఆ సీన్స్ తొలగించాం.. ఎందుకంటే: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Ramnagar Bunny Movie: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా, స్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రామ్ నగర్ బన్నీ. మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించగా.. రేపు (అక్టోబర్ 4) గ్రాండ్‌గా థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టనుంది. ఈ సందర్భంగా 'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మీడియాతో ముచ్చటించారు. రామ్ నగర్ బన్నీ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ అని.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ తన మొదటి సినిమా కావడం సంతోషంగా ఉందన్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తమ టీమ్ అంతా కాన్ఫిడెన్స్‌తో ఉన్నామన్నారు.

Also Read: Pawan Kalyan Fever: పవన్ కు తీవ్ర జ్వరం.. వారాహీ సభపై ఉత్కంఠ..  

సినిమా మీద నమ్మకంతోనే టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పానని చంద్రహాస్ చెప్పారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ తన గురించి హీరో క్వాలిటీస్ ఉన్నాయని చెప్పడం సంతోషంగా అనిపించిందన్నారు. ఈ మూవీలో తాను సూపర్ హీరోలా కనిపించనని.. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తానని అన్నారు. తాను తిట్లు తింటానని.. అవమానాలు ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడొచ్చన్నారు. 

ఈ చిత్రంలో ఒక పాటలో ముద్దు సీన్స్ ఉండేవని.. అయితే అవి సెన్సార్‌లో కట్ చేయించామన్నారు. కిస్ సీన్స్ సినిమాలో లేవన్నారు. నలుగురు హీరోయిన్స్‌ మూవీలో ఉన్నారి.. పర్ఫామెన్స్‌ పరంగా మంచి స్కోప్ ఉంటుందన్నారు. కథానుసారమే నలుగురు హీరోయిన్స్‌ను తీసుకున్నామన్నారు. ఈ మూవీలో మా నాన్న ప్రభాకర్ చిన్న రోల్‌లో కనిపిస్తారని.. ఆ టైమ్‌కు ఆర్టిస్ట్‌ రాకపోతే ఆయనే చేశారని చెప్పారు. డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ తనను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశారని అన్నారు.

ఆటిట్యూడ్ స్టార్ అనేది తాను పెట్టుకున్నది కాదని.. ఈ సినిమా చూశాక తాను ఆ ట్యాగ్‌కు అర్హుడిని కాదంటే తీసేస్తానని చెప్పారు. తనను ట్రోల్ చేసిన వారికి ఇప్పటికే తన అభిప్రాయం చెప్పానని.. ట్రోల్స్‌ వల్ల పెద్దగా బాధపడలేదన్నారు. తనకు ప్రేక్షకులను అలరించాలని ఉందని.. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటానని అన్నారు. ప్రస్తుతం మరో సినిమాల్లో నటిస్తున్నానని.. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. 

Also Read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News