SSC CGL Tier 1: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 ఆన్స్‌ర్‌ కీ విడుదల.. ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

SSC CGL Tier 1 Answer Key 2024: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 పరీక్ష జవాబు పత్రాన్ని విడుల చేశారు. కాంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ టైర్ 1 ఎగ్జామ్‌ సెప్టెంబర్‌ 9 నుంచి 26 మధ్య నిర్వహించింది. దీనికి సంబంధించిన జవాబు కీ విడుదల చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Oct 4, 2024, 12:14 PM IST
SSC CGL Tier 1: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 ఆన్స్‌ర్‌ కీ విడుదల.. ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

SSC CGL Tier 1 Answer Key 2024: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ టైర్‌ 1 కు సంబంధించిన జవాబు కీ అక్టోబర్‌ 3న విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.ssc.gov.in, ssc.digialm.com అధికారిక్‌ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు లాగిన్‌ అయి ఆన్సర్‌ కీ ను డౌన్‌లోడ్‌ చేయవచ్చు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఆన్సర్‌ కీ 2024 డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం..
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఆన్సర్‌ కీ నేరుగా విడుదల చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 6 నుంచి 26 వరకు దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించారు. మీ లాగిన్‌ వివరాలతో ఆన్సర్‌ కీ పొందవచ్చు. మీ క్రమ సంఖ్య, పాస్వర్డ్‌ సహాయంతో లాగిన్‌ అవ్వాలి. కింద ఇచ్చిన లాగిన్‌ లింక్స్‌ ద్వారా ఆన్సర్‌ కీ పొందవచ్చు. ఆన్సర్‌ కీ కి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 3 నుంచి 6 సాయంత్రం 6 వరకు సబ్మిట్‌ చేయవచ్చు. దీనికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 

ఎస్ఎస్‌సీ సీజీఎల్‌ ఆన్సర్‌ కీ 2024 విడుదల..
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం
www.ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
హోంపేజీలో కుడివైపు ఉన్న లాగిన్‌ ట్యాబ్‌ పై క్లిక్‌ చేయాలి.
అక్కడ కాంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 (Tier1) సెలక్ట్‌ చేయాలి.
ఆన్సర్‌ కీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
మీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఆన్సర్‌ కీ కనిపిస్తుంది. మీకు అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్‌ చేయవచ్చు.

ఇదీ చదవండి: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఆన్సర్‌ కీ 2024 టైర్‌ 1 ఎగ్జామ్‌ ఆబ్జెక్టీవ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మల్టిపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌.  ప్రతి సెక్షన్‌కు 25 మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలో గరిష్ట మార్కులు 50. రెండు భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌, హందీ భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు క్వాలిఫై అవ్వాలంటే 30 శాతం మార్కులు అన్‌రిజర్వడ్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ 25 శాతం, మిగతావారికి 20 శాతం మార్కులు పొందాలి.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఈ రిక్రూట్మెంట్‌ ద్వారా 17727 పోస్టుల భర్తీని లక్ష్యంగా పెట్టుకుంది. టైర్‌ II ఎగ్జామ్‌కు పేపర్‌ 1 తప్పనిసరిగా అందరూ రాయాలి. పేపర్‌ 2 కేవలం జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్ (JSO) మాత్రమే రాయాలి. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఎగ్జామ్‌ 2024 జూన్‌ నెలలో నిర్వహించారు.

ఇదీ చదవండి:  రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News