వివి వినాయక్‌ హీరోగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల

వివి వినాయక్‌ హీరోగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Last Updated : Oct 9, 2019, 12:25 AM IST
వివి వినాయక్‌ హీరోగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్‌: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరున్న వివి వినాయక్‌ ఇప్పుడు హీరో అవతారమెత్తారు. డైరెక్టర్‌ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. గతంలో శరభ అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఎన్ నరసింహ ఈ ప్రయత్నంతో సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. బుధవారం వివి వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సీనయ్య అనే టైటిల్‌‌తో రూపొందనున్న ఈ సినిమాలో వినాయక్‌ ఓ మాస్‌ లుక్‌తో దర్శనమివ్వనున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్‌, టైటిల్‌ని చూస్తే అర్థమవుతోంది. 

సీనయ్య సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నట్లు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా పేర్కొంది. త్వరలోనే సీనయ్య రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఎందరో హీరోలను మాస్ హీరోలను చేసిన వివి వినాయక్ స్వయంగా హీరోగా చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Trending News