TCS: టీసీఎస్ లో 11 ఏళ్లుగా పని.. లైంగిక ఆరోపణల్లో ఉద్యోగికి అన్యాయం..!

TCS Employee Fired: టిసిఎస్ కంపెనీలో ఒక అరుదైన సంఘటన జరిగింది. 2018 మార్చిలో యూకే లో తన 9 నెలల అసైన్మెంట్ పూర్తి కాకముందే.. భారతదేశానికి ఆమె తిరిగి వస్తుండగా ఆమెపై.. లైంగిక వేధింపులు జరిగాయని టిసిఎస్ కంపెనీలో పనిచేసే టెక్కీ తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ కేసు దాదాపు ఐదు సంవత్సరాలుగా జరుగుతోంది.‌ అయితే ఈ విషయంలో ఆ బాధితురాలికి ఉద్యోగం పోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 10, 2024, 10:22 AM IST
TCS: టీసీఎస్ లో 11 ఏళ్లుగా పని.. లైంగిక ఆరోపణల్లో ఉద్యోగికి అన్యాయం..!

Tata company Employee: ఐటీ మేనేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో  పనిచేస్తున్న 34 యేళ్ళ మహిళ టెక్కీ యునైటెడ్ కింగ్డమ్ లో ఒక అసైన్మెంట్ సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని, తన మాజీ సూపర్వైజర్ పై.. గత ఐదేళ్లుగా చట్టపరమైన కేసుతో పోరాడుతోంది.

అయితే లైంగిక వేధింపులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసిసి స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అలాగే కంపెనీ చట్టపరమైన పోరాటాన్ని ఆపివేయడం, ఇతర వ్యూహాలను అమలు చేయడం వంటివి చేస్తూ.. ఫిర్యాదు చేసినందుకు ఈ ప్రక్రియను శిక్షగా మార్చారు అంటూ బాధిత యువతి చెప్పుకొచ్చింది.. 

టెక్కీ  రాధిక (పేరు మార్చబడింది).. భారతదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతుండగా రాధికా తొమ్మిది నెలల అసైన్మెంట్ ముగిసేలోపే యూకేలో మార్చి 2018లో తనపై లైంగికంగా దాడి చేశారంటూ ఆమె తెలిపింది.  నాన్ బిజినెస్ గంటలలో అతడు ఏర్పాటు చేసిన వ్యక్తిగత షెడ్యూల్ లో మీటింగ్ అరేంజ్ చేశారు. ముఖ్యంగా హెచ్ఆర్ నుండి ఉద్యోగులు లేకుండా.. కాన్ఫరెన్స్ రూమ్ లో రాత్రి 7 గంటలకు ప్రారంభమైన మీటింగ్ 11 గంటలకు ముగిసింది. 

ఆ తరువాత అతడు నాపై లైంగికంగా దాడి చేశాడు.  ముఖ్యంగా అతడి మేనేజర్ నన్ను రెండు సార్లు కొట్టాడు అంటూ ఆరోపించింది. అతడికి సహకరించాలని లేదంటే నా కెరియర్ ను  నాశనం చేస్తామని బెదిరించారంటూ రాధిక చెప్పుకొచ్చింది. 

అంతేకాదు టిసిఎస్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీలో సూపర్వైజర్ చేసిన పనిపై వెంటనే శిక్ష తీసుకొని అమలు చేయాలని ఆమె కోరినా.. కంపెనీ ఎటువంటి న్యాయం చేయలేదు. సాక్షాలను చూపించమని కోరగా ..అందుకు తగ్గ సాక్షాధారాలను చూపించకపోవడంతో కేసు కొట్టి వేశారు.

అంతేకాదు సైట్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చూడడానికి కంపెనీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆ మానవ మృగాన్ని కాపాడడానికి తనను ఉద్యోగం నుండి కూడా తీసేశారు అంటూ బాధిత యువతి చెప్పుకొచ్చింది. 11 ఏళ్లుగా పనిచేస్తున్న తనపై ఇలాంటి దాడి జరిగిందని చెప్పినా ఎవరు ముందుకు రాకపోవడం చాలా దారుణం అంటూ బాధపడింది. మొత్తానికి అయితే తనను ఉద్యోగం నుంచి తీసేసి తనకు అన్యాయం చేశారంటూ టీసీఎస్ పై బాధిత యువతి బాధపడింది.

 

Also read: Bank Holidays 2024: ఆ 5 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News