GN Saibaba: ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత.. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో తుదిశ్వాస

Professor GN Saibaba Passed Away: గొప్ప మేధావి, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 12, 2024, 11:29 PM IST
GN Saibaba: ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత.. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో తుదిశ్వాస

Professor GN Saibaba: మావోయిస్టు సానుభూతిపరుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై విడుదలైన సాయిబాబా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతడి మృతికి వివిధ రాజకీయ పక్షాలతోపాటు మావోయిస్టు సానుభూతిపరులు, మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు సంతాపం ప్రకటించారు. దసరా పండుగ రోజే అతడు మరణించడం తీవ్ర విషాదం నింపింది.

Also Read: KCR Family: దసరా సంబరాల్లో కేసీఆర్‌.. మనవడితో వీడియో కాల్‌ వైరల్‌

 

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్న సమయంలో ప్రొఫెసర్‌ సాయిబాబాకు మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి అతడిని దాదాపు పదేళ్ల పాటు జైలులో నిర్బంధించారు. జీవిత కాల జైలు శిక్ష పొందిన ఆయనకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఈ ఏడాది మార్చ్‌లో నిర్దోషిగా తీర్పునిచ్చింది. ఆయనతోపాటు మరో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

Also Read: Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతర

 

ఎవరు సాయిబాబా?
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని పేద రైతు కుటుంబంలో సాయిబాబా 1967లో జన్మించారు. పోలియో కారణంగా ఐదేళ్ల వయసులోనే వీల్‌ చైర్‌కు పరిమితమయ్యారు. ఉన్నత చదువులు చదివిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్‌ లాల్‌ ఆనంద్‌ కళాశాలలో ఆంగ్ల ఆచార్యుడిగా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా సామాజిక అంశాలపై స్పందిస్తూ అనేక రచనలు చేస్తుంటారు. మానవ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తుండేవారు. అయితే మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతో మహారాష్ట్ర పోలీసులు 2014లో ప్రొఫెసర్‌ సాయిబాబాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News