Ttd good news for devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తీపికబురు చెప్పిందని తెలుస్తొంది. దీంతో భక్తులు మళ్లీ తిరుమలకు వచ్చేందుకు ఏర్పాట్లలో సిద్దమైనట్లు సమాచారం.
కొన్నిరోజులుగా తిరుమలలో భారీగా వర్షం కురుస్తొంది. ముఖ్యంగా చెన్నై తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తొంది. దీనంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. తిరుమాడ వీధులన్ని చెరువుల్ని తలపించాయి.
ముఖ్యంగా కలియుగ దైవం తిరుమలను దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇలాంటి సమయంలో కుండపోతగా కురుస్తున్న వర్షం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుమలలోని నడక మార్గంలో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో స్వామి వారి భక్తుల కోసం టీటీడీ ముందు జాగ్రత్తగా నడక మార్గాన్ని రెండు రోజుల క్రితం క్లోజ్ చేసింది. మరోవైపు క్రూరజంతువుల సంచారం కూడా ఇటీవల ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో తాజాగా, వరుణుడు శాంతించినట్లు తెలుస్తొంది. దీంతో టీటీడీ భక్తుల కోసం నడక మార్గాన్ని టీటీడీ మళ్లీ ప్రారంభించింది. సాధారణంగా చాలా మంది భక్తులు నడక మార్గం గుండా వచ్చి తిరుమలను దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే టీటీడీ మరల నడక మార్గంను స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. ఒక వైపు వర్షాలు కురుస్తున్న శ్రీవారి భక్తులు మాత్రం అవేంలెక్క చేయకుండా స్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు తెలుస్తొంది. టోకెన్లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.గురువారం స్వామివారిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.