Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు, ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23పై ఊహించని డిస్కౌంట్

Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ దీపావళి సేల్ 2024 ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ఇతర వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీకిష్టమైన ఐఫోన్ 15 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2024, 01:05 PM IST
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు, ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23పై ఊహించని డిస్కౌంట్

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 రేపట్నించి అధికారికంగా ప్రారంభం కానుండగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15 సహా చాలా రకాల ఉత్పత్తులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 కొనే ఆలోచన ఉంటే ఇదే సరైన సమయం. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 చాలా తక్కువ ధరకే లభ్యం కానుంది. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఎస్బీఐ కార్డుతో  కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందే వీలుంది. ముఖ్యంగా ఐఫోన్ 15 కేవలం 49,999 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మార్కెట్ ధర 72 వేలుంది. కానీ బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా కేవలం 50 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా Samsung Galaxy S23 ప్రీమియం ఫోన్‌ను 37,999 వేలకు తీసుకోవచ్చు. ఇక ఆపిల్ కంపెనీ ఇయర్ పాడ్స్‌ను 10 వేలలోపు ధరకే కొనవచ్చు. ఇది కాకుండా ప్రతి గంటకు బాంబ్ డీల్ అని ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో మరింత తగ్గింపు లభిస్తుంది. 

ఇక ఈ సేల్‌లో Poco F6, Poco X6 Pro, iPhone 16 ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సంస్థలు వివిధ సందర్భాల్లో నిర్వహించే డిస్కౌంట్ సేల్స్‌లో ఇదే ఆఖరిది కావచ్చు. తరువాత వచ్చే ఏడాది జనవరి నెలలో రిపబ్లిక్ డే సేల్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇయర్ బడ్స్, సౌండ్ బార్లపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 అక్టోబర్ 31 వరకు ఉంటుంది. 

Also read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి షురూ, ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News