హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ హై కోర్టులో కొత్తగా నిర్మించిన ఓ భవనం ప్రారంభోత్సవం కోసం శనివారం జోధ్‌పూర్‌‌కి వచ్చిన సందర్భంగా హైదరాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై బాబ్డే స్పందిస్తూ ''ప్రతీకార చర్యలతో ఎప్పుడూ న్యాయం పొందకూడదు'' అని అన్నారు.

Last Updated : Dec 7, 2019, 06:34 PM IST
హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు

జోధ్‌పూర్: హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసు(Disha gang rape and murder case)లో నిందితులుగా ఉన్న నలుగురిని చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ కేసులో న్యాయం జరిగిందని ప్రజా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్‌ని కొందరు స్వాగతిస్తే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. హర్షం వ్యక్తంచేస్తున్న వారి సంఖ్యతో పోల్చుకుంటే.. వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య చిన్నదే అయినప్పటికీ.. ఎవరి వాదనలు వారికున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డె సైతం 'న్యాయం'పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పూర్‌లోని రాజస్థాన్ హై కోర్టులో కొత్తగా నిర్మించిన ఓ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. ''ప్రతీకార చర్యలతో ఎప్పుడూ న్యాయం పొందకూడదు'' అని అన్నారు. ''తన దృష్టిలో అలా ప్రతీకారంతో పొందేటటువంటి న్యాయంతో న్యాయమే తన కనీస గుణాన్ని కోల్పోతుంది'' అని సీజేఐ బాబ్డే అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న మరుసటి రోజే జస్టిస్ బాబ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Read also : వాళ్లకు జైల్లో చిప్పకూడు పెట్టాల్సింది.. కానీ చంపాల్సింది కాదు: ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుల కుటుంబసభ్యుల ఆవేదన

సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో సత్వరమే న్యాయం కావాలని బాధితుల నుంచి మొదలుకుని ప్రజా సంఘాల వరకు డిమాండ్ చేసే సంగతి తెలిసిందే. అయితే, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమయ్యే ఈ డిమాండ్‌పై సైతం జస్టిస్ బాబ్డే స్పందిస్తూ.. ''న్యాయం ఎప్పుడూ తొందరపాటుతోనో లేక తొందరపడితేనో వచ్చేది కాదు''అని అన్నారు. Read Also : ఉన్నావ్ రేప్ కేసు: నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్‌ చేయాలి.. బాధితురాలి తండ్రి డిమాండ్

Trending News