Metro Rail: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. పరుగులు పెట్టనున్న మెట్రో రైలు రెండో దశ

Major Decisions Taken By Telangana Cabinet: రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైలు పథకంపై సమీక్ష చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 27, 2024, 01:03 AM IST
Metro Rail: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. పరుగులు పెట్టనున్న మెట్రో రైలు రెండో దశ

Telangana Cabinet: రాష్ట్ర రాజధాని.. ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత మెరుగుపడనుంది. ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైలు అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా తొలి దశలో ఉన్న అసంపూర్తి పనులను పూర్తి చేయడంతోపాటు రెండో దశ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రెండో దశ పూర్తయితే హైదరాబాద్‌లో రవాణా సదుపాయం మరింత అందుబాటులోకి వచ్చి ప్రయాణికులు తమ గమ్యస్థానాలను వేగంగా.. సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంది.

Also Read: Telangana DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఒకటే డీఏకు ఆమోదం

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘ సమయం పాటు జరిగింది. దాదాపు ఐదున్నర గంటల వరకు కొనసాగినట్లు మంత్రులు తెలిపారు. సమావేశంలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు అన్ని శాఖల మంత్రులు హాజరై పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏకు ఆమోదం తెలపడం విశేషం. ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.

Also Read: MEIL Donation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పంచన చేరిన మేఘా కృష్ణారెడ్డి.. రూ.200 కోట్ల విరాళం

మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..

డీఏ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళిని పురస్కరించి ఒక డీఏను విడుదలకు మంత్రివర్గం ఆమోదం

మెట్రో రైలు
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు నిర్మించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. నాగోల్ - శంషాబాద్, రాయదుర్గం- కోకాపేట్, ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట, మియాపూర్ - పటాన్ చెరు, ఎల్‌బీ నగర్ - హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయం.

  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలని మంత్రివర్గం నిర్ణయం.
  • జీవో 317కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.
  • జీవో 46కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉండడంతో న్యాయ సలహాతో అసెంబ్లీలో చర్చించిన అనంతరం నిర్ణయం.
  • నవంబర్ 30వ తేదీ వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తికి నిర్ణయం. సర్వే కోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపట్టాలి.
  • పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా. పీపీపీ విధానంలో రోడ్డ నిర్మాణనికి అనుమతివ్వాలని మంత్రివర్గం ఆమోదం.
  • ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్‌లోని పోలీసు శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని వైద్య శాఖకు  బదిలీ
  • ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల- స్థలం కేటాయింపు
  • గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయిస్తూ నిర్ణయం.
  • మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్ల మంజూరు.
  • రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పేరుకుపోయిన స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో స్టిల్ట్ తొలగింపు.
  • రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్‌కు సంబంధించి సబ్ కమిటీ నివేదిక సమర్పణ.
  • రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News