ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిపై హై పవర్ కమిటీ

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని ప్రచారం  ఓ వైపు .. రైతుల ఆందోళనలు మరోవైపు ..   మంత్రుల ప్రకటనలు.. ప్రతిపక్ష నేతల విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గందరగోళం నెలకొంది. దీనికి తెరదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Dec 29, 2019, 05:22 PM IST
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిపై హై పవర్ కమిటీ

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని ప్రచారం  ఓ వైపు .. రైతుల ఆందోళనలు మరోవైపు ..   మంత్రుల ప్రకటనలు.. ప్రతిపక్ష నేతల విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గందరగోళం నెలకొంది. దీనికి తెరదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ప్రకటనపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో .. తాజాగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.  ఆర్ధిక మంత్రి బుగ్గజ రాజేంద్ర నాథ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 16 మంది సభ్యులుగా ఉంటారు.  కమిటీకి కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ వ్యవహరించనున్నారు. పలువురు మంత్రులు, ఏపీ డీజీపీ కూడా ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులకు సంబంధించి గతంలో జీఎన్ రావు కమిటీ  ఇచ్చిన నివేదికలను హై పవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News