Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కా

Business Ideas: ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉన్నచోటి నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ డిజిటల్ విప్లవం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించి కుగ్రామాల్లో ఉండే ప్రజలు సైతం లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు.  

Written by - Bhoomi | Last Updated : Oct 31, 2024, 04:21 PM IST
Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కా

Business Ideas: మీరు కూడా ఈ డిజిటల్ విప్లవాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు ప్రవేశపెడుతున్నాం.ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పల్లెటూర్లో ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో సమానంగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం డిజిటల్ యుగంలో యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటివి ఉపయోగించి, పెద్ద మొత్తంలో నెటిజన్లు డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేవారు పెద్ద మొత్తంలో ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఉన్నారు. వీరికి గూగుల్ నుంచి నేరుగా అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రూపంలో డబ్బులు లభిస్తుంది. 

మీరు కేవలం ఒక మొబైల్ ఫోన్ ద్వారా చక్కటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక జిమెయిల్ అకౌంట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయవచ్చు. ఆ తర్వాత అందులో కంటెంట్ పెట్టడం ద్వారా మీరు ఆ వీడియోలకు వచ్చే వ్యూస్ అలాగే ఆ వీడియోలపై ప్లే అయ్యే అడ్వర్టైజ్మెంట్ల దూరంలో రెవెన్యూ లభిస్తుంది. 

ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే గ్రామీణ జీవన విధానాన్ని ఒక వీడియో వ్లాగ్ రూపంలో వీడియోలు తీసి యూట్యూబ్ లో  అప్లోడ్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించవచ్చు. ఉదాహరణకు మీరు ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసినట్లయితే వాటిని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయంలో పద్ధతులు, అదే విధంగా అవలంబించే విధానాలు వంటివి తెలుసుకునేందుకు సామాన్య ప్రజలతో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు ఎందరో ఈ వీడియోలను చూసేందుకు సిద్ధంగా ఉంటారు.

Also Read: Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడి  

ఉదాహరణకు మీరు ఆర్గానిక్ పద్ధతిలో చెరకును పండించడం, ఆ చెరకు రసంతో బెల్లం, బెల్లం పొడిని తయారు చేసే విధానాన్ని వీడియోల రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే, మీ వద్ద నుంచి బెల్లం కొనేందుకు సైతం ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. వారికి మీరు అందుబాటులో ఉన్న పలు డెలివరీ సర్వీసుల ద్వారా కస్టమర్లకు డోర్ డెలివరీ సైతం చేయవచ్చు.అలాగే ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల్లో పండించే బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పండ్లు వంటివి సైతం కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తారు. 

అయితే మీరు ఈ వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూనే, ప్రేక్షకుల నుంచి మీరు చూపించిన ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలు ఆర్డర్లను సైతం ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో అన్ని ప్రాంతాలకు డెలివరీ సర్వీసులు అందించేందుకు, ఫ్లిప్ కార్ట; అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా బయ్యర్లు సైతం మీ వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తారు. అప్పుడు మీరు హోల్సేల్ రేటు ద్వారా ఒకేసారి పంటను అమ్ముకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మీకు యూట్యూబ్ ద్వారా ఆదాయం లభిస్తుంది. అదే సమయంలో మీ పంట కూడా పూర్తిగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: Bhai dooj 2004: భాయ్ దూజ్ ఎప్పుడు..?.. యమధర్మరాజు తన సోదరి యమునకు ఇచ్చిన ఈ వరం గురించి మీకు తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News