మోహన్ బాబు పార్టీ మారతారా ?

సినీ నటుడు మోహన్ బాబు పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమైందనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.   

Last Updated : Jan 6, 2020, 05:48 PM IST
మోహన్ బాబు పార్టీ మారతారా ?

సినీ నటుడు మోహన్ బాబు పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమైందనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. ఇవాళ మంచు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ..బీజేపీలో రావాలని మోహన్ బాబును ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు సాయంత్రం అమిత్ షా తో కూడా మంచు ఫ్యామిలీ భేటీ కానుంది. దీంతో మోహన్ బాబు వైసీపీని వీడి కమలం పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.  
వైసీపీపై అలక..!!
మోహన్ బాబు ..  ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సీఎం జగన్ కుటుంబంతో ఆయనకు బంధుత్వం కూడా ఉంది. దీంతో జగన్ సీఎం కాగానే .. ఆయనకు మంచి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పదవిని మోహన్ బాబు ఆశించారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ టీటీడీ ఛైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు జగన్. అయితే తాను పదవిని కోరుకోలేదని మోహన్ బాబు క్లారిటీ ఇవ్వడంతో అప్పటికి అంతా సద్దుమణిగింది. ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ ఆ పదవి కూడా మోహన్ బాబుకు దక్కలేదు. దీంతో పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని.. అందుకే మోహన్ బాబు వైసీపీ  కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మరోవైపు త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి తనకు దక్కుతుందని మోహన్ బాబు ఆశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ వైసీపీ అధిష్ఠానం దీనికీ సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో ఆయన పార్టీ మార్పునకు మొగ్గు చూపినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ నటులను కలిశారు. ఆ సమయంలో తెలుగు, తమిళ, మళయాల లాంటి దక్షిణాది తారలకు ఆ అవకాశం కలగలేదు. ఐతే దక్షిణాది తారలను ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశపరిచేందుకు ఆ బాధ్యతను మంచు లక్ష్మి భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిందని మరో ప్రచారం ప్రారంభమైంది. మొత్తంగా ఏం జరుగుతుందనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశంఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News