Kamalaharis are related to Bhadradri Kothagudem district: అమెరికా అధ్యక్ష రేసులో అటు కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన సర్వత్ర ఉత్కంఠ నిలబడి ఉంది. మొన్నటిదాకా అన్ని సర్వేల్లోనూ టాప్ లో నిలబడ్డ కమలాహరిస్ ఎన్నికల సమీపించే కొద్దీ సర్వేలో కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికి కూడా ట్రంప్ పైన కమలా హరిస్ దే సర్వేలో పై చేయిగా కనిపిస్తోంది. దీంతో ఆమె గెలవడం ఖాయం అని అభిమానులు అంచనా వేస్తుంటే, ట్రంప్ కూడా తాను గెలుస్తానని భరోసా ఇస్తున్నారు. అయితే కమలా హరీస్ కు మద్దతుగా తెలిపే వారిలో పెద్ద మొత్తంలో భారతీయ మూలాలు ఉన్న అమెరికన్లు ఉన్నారు. వీరంతా కమలహరిస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మూలాలు ఉన్న కమల హ్యారిస్ కు NRIలలో దాదాపు 61 శాతం వరకు మద్దతు ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ పాటిస్తున్న వలస విధానం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో వీసాలను రిజెక్ట్ చేశారు. అలాగే పలు కంపెనీలు భారతీయ మూలాలను అమెరికాలో ఉద్యోగాలను నిలిపివేశారు. దీంతో కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయితే తమకు బాగుంటుందని భావించే భారతీయ అమెరికన్లు చాలామంది ఉన్నారు. అందుకోసం కమలహరిస్ పేరిట ఇప్పటికే యాగాలు జరుపుతున్నారు. తమిళనాడులోని తులసేంద్రపురం కమలహరిస్ తల్లి శ్యామల గోపాలన్ పుట్టినిల్లు కావడం విశేషం. ఆమె ఇక్కడి నుంచి అమెరికా వెళ్లి అక్కడే నల్లజాతీయుడైన డొనాల్డ్ హారిస్ ను వివాహం చేసుకున్నారు.
Also Read: Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్ హిట్ స్కీమ్.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్..
అయితే ఐదేళ్ల వయసులోనే కమలా తల్లిదండ్రులు ఇరువురు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తల్లి శ్యామల హరీస్ తన పిల్లలిద్దరిని కంటికి రెప్పలా చూసుకుని పెంచుకున్నారు. ప్రస్తుతం కమలహరిస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధికార పీఠమైన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం తమకెంతో గర్వకారణం అని తమిళనాడులోని తులసేంద్రపురం వాసులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కమలా హరీస్ తన తల్లి శ్యామల గోపాలన్ పేరిట పలు స్వచ్ఛంద కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలో ఆమె సన్నిహితులు కమలహరిస్ తల్లి శ్యామల గోపాలన్ అని పేరిట ట్రస్టులు స్థాపించి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా కమల హరీస్ సన్నిహితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వాసి నల్లా సురేష్ రెడ్డి, పాల్వంచలో కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ పేరిట ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించి నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కమలాహరిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని గడచిన 11 రోజులుగా ఆయన శ్రీ రాజశ్యామలాంబ సుదర్శన మహా యజ్ఞం జరుపుతున్నారు. కమలహరిస్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read:Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.