Owaisi Vs Bandi: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ముస్లిమేతరులకు స్థానం కల్పించనప్పుడు....వక్ఫ్ బోర్డులో హిందువులకు ఎందుకు స్థానం కల్పించాలంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని బండి సంజయ్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప...ఏనాడూ ప్రజల ఆస్తులను వక్ఫ్ ఆస్తులను చెప్పి కబ్జా చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఒవైసీ దృష్టిలో భగవంతుడంటే వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. అల్లా పేరు చెప్పుకుని భూములను దోచుకున్నడని మండిపడ్డారు. మరోవైపు ఏదైనా మసీదులో కానీ.. చర్చిలో కానీ.. వాళ్ల మతానికి సంబంధించిన వారే పనిచేస్తారు కానీ.. వాళ్ల మతాన్ని నమ్మని హిందువులను ఉద్యోగులుగా పెట్టుకోరు. అలాగే తిరుమల వెంకన్నపై భక్తి ఉన్నవారే అక్కడ పనిచేస్తారన్నారు.
ఇక ఒవైసీ బ్రదర్స్ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లింలు ఇకనైనా నిజాలు తెలుసుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి ఓటేసి ఎంఐఎంను గెలిపిస్తున్నా ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు గోల్డ్ సిటీగా ఎందుకు మారలేదు. ఓల్డ్ సిటీ ఇప్పటికీ అభివృద్దికి ఆమడ దూరంలో ఎందుకు మిగిలిపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి పార్టీ బీఆర్ఎస్తో దేశ ద్రోహి పార్టీ తెగతెంపులకు సిద్ధమైనట్లు ఉందన్నారు. దేశాన్ని దోచుకుంటున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ కాంగ్రెస్‌తో అంటకాగేందుకు ఎంఐఎం తంటాలు పడుతోందన్నారు. ఎంఐఎంతో అంటకాగినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter