AP Liquor: ఏపీలో మందుబాబులకు మహిళలకు షాక్‌.. వైన్స్‌ వద్దంటూ ఎక్కడికక్కడ మహిళల అడ్డగింత

Local Women Objection On Wine Shop Opens: మద్యం దుకాణాల ఏర్పాటు రచ్చ రేపుతోంది. నివాసాల మధ్య ఏర్పాటుతో మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 3, 2024, 12:07 PM IST
AP Liquor: ఏపీలో మందుబాబులకు మహిళలకు షాక్‌.. వైన్స్‌ వద్దంటూ ఎక్కడికక్కడ మహిళల అడ్డగింత

AP Wine Shops: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే విక్రయిస్తుండడంతో తమ భర్తలు, కుమారులు మద్యానికి బానిసలు అవుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. దీనికితోడు నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటవడంతో అక్కడి స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్‌ దుకాణం వద్దంటూ మహిళలు రోడ్డుపైకి చేరుతున్నారు. ఒకే రోజు మహిళలు రెండు జిల్లాలో ధర్నా చేపట్టారు. 'మద్యం దుకాణం' వద్దంటూ మహిళలు తమ పిల్లలతో కలిసి రోడ్డుపైకి చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అక్కడి మద్యం బాబులకు షాక్‌ తగిలింది. వాటిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాంతం ఉండడం గమనార్హం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pithapuram: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎం షెడ్యూల్‌ ఇదే!

 

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గాంధీనగర్‌లో ఇటీవల మద్యం దుకాణం ఏర్పాటైంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటవడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చర్చిలు, మసీదు, అంగనవాడీ కేంద్రం ఉండడంతో ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక మత్య్సకారులు వాపోతున్నారు. మద్యం దుకాణం తొలగించాలని కోరుతూ ఆదివారం స్థానిక మత్య్సకార మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే చిన్నాపెద్ద తేడా లేకుండా మద్యానికి బానిస అవుతారని మహిళలు వాపోయారు. వెంటనే ఈ ప్రాంతంలో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. మద్యం విక్రయిస్తే దుకాణం తొలగించే దాకా తాము పోరాడుతామని మత్య్సకార మహిళలు హెచ్చరించారు.

Also Read: Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌

దాచేపల్లిలో రాస్తారోకో
మద్యం దుకాణం ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లాలో మహిళలు రాస్తారోకో చేపట్టారు. నివాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేశారని స్థానిక మహిళలు ఆదివారం రాత్రి రోడ్డెక్కారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో ఇటీవల కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటుచేశారు. సమీపంలోని గ్రామస్తులు వైన్ షాప్ ఏర్పాటు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. కుటుంబాలు ఉండే మధ్య మద్యం షాపు ఏమిటని మహిళలు నిలదీశారు. వైన్ షాప్ సమీపంలో ఉన్న పాఠశాలకు నిత్యం విద్యార్థులు వస్తు వెళ్తుంటారని.. ఇక్కడ ఎలా మద్యం దుకాణం పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్ద మందుబాబులు రెచ్చిపోయి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి  ఇళ్ల మధ్య మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించకపోతే తీవ్రస్థాయిలో మద్యం చేస్తామని స్థానిక మహిళలు హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x