రాజధాని అంశంపై జనవరి 20న భేటీకానున్న ఏపీ మంత్రివర్గం

రాష్ట్ర రాజధాని  అంశం నిర్ణయించడానికి జనవరి 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తేలిపారు. హై పవర్ కమిటీ తన సమర్పించనున్న నివేదికపై జనవరి 20న భేటీలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ కూడా అదే రోజు సమావేశమవుతుందని తెలిపారు.

Last Updated : Jan 14, 2020, 05:28 PM IST
రాజధాని అంశంపై జనవరి 20న భేటీకానున్న ఏపీ మంత్రివర్గం

అమరావతి : రాష్ట్ర రాజధాని  అంశం నిర్ణయించడానికి జనవరి 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తేలిపారు. హై పవర్ కమిటీ సమర్పించనున్న నివేదికపై జనవరి 20న భేటీలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ కూడా అదే రోజు సమావేశమవుతుందని తెలిపారు.

సోమవారం సమావేశమైన హై పవర్ కమిటీ, సమర్పించాల్సిన నివేదికపై ఒక అవగాహనకు వచ్చిన తరుణంలో రాజధానికి సంబంధించిన రైతులకు ఏమైనా అపోహలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించింది. అయితే, రైతులు తమ సమస్యలను వ్యక్తిగతంగా లేదా ఈమెయిల్ ద్వారా పంపించడానికి హై పవర్ కమిటీ రైతులకు అవకాశం ఇచ్చింది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే విశాఖపట్నంలో సెక్రెటరియేట్ తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. తద్వారా అధికారులు సెక్రెటరియేట్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలకు కావలిసిన భవనాలను పరిశీలిస్తున్నారు. 

ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి 29 గ్రామాల రైతులను శాంతింపచేయడానికి అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News