America Vice President: తెలుగింటి అల్లుడే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్..

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్లను మట్టి కరిపించి రిపబ్లికన్లు దూసుకుపోతున్నారు. మొత్తంగా ట్రంప్ దెబ్బకు కమల హారిస్ కుదేలైంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జేడీ వాన్స్ భార్య తెలుగింటి ఆడపడుచు కావడం విశేషం.  ఉషా చిలుకూరి విశాఖ వాసులకు  బంధువు. లాస్ట్ ఇయర్ వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఆమె సేవలు అందించిన  శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ ఎలెక్ట్ అయిన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 6, 2024, 04:25 PM IST
America Vice President: తెలుగింటి అల్లుడే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్..

America Vice President: అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్లను మట్టి కరిపించి రిపబ్లికన్లు దూసుకుపోతున్నారు. మొత్తంగా ట్రంప్ దెబ్బకు కమల హారిస్ కుదేలైంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జేడీ వాన్స్ భార్య తెలుగింటి ఆడపడుచు కావడం విశేషం.  ఉషా చిలుకూరి విశాఖ వాసులకు  బంధువు. లాస్ట్ ఇయర్ వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఆమె సేవలు అందించిన  శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ ఎలెక్ట్ అయిన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఉషకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు ప్రొఫెసర్ గా పనిచేసారు.  కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కూతురే ఉష చిలుకూరి.

అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌  రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేయడంపై శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు.  ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఉషా చిలుకూరి అక్కడ పుట్టి పెరిగింది. వాన్స్‌ అభ్యర్థిత్వం తో పాటు తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు శ్రేయోభిలాషులు ఫోన్‌లో అభినందనలు తెలిపారని శాంతమ్మ వెల్లడించారు. చెన్నైలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఉష మేనత్త శారద.. ఉష, వాన్స్ పెళ్లికి సైతం హాజరయ్యారు. అంతేకాదు అప్పట్లో వాళ్ల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.  ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు వలస వెళ్లిన వాళ్ల కుటుంబం .. ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లింది.

ఉషా చిలుకూరి పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం. ఉషకు తాత వరుస అయిన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటుంన్నారు. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే.

రామశాస్త్రి మద్రాసు వలస వెళ్లిపోయి ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్ గా  పనిచేశారు.  ఆయన భార్య బాలాత్రిపుర సుందరి కాగా, వీరికి అవధాని, నారాయణశాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులున్నారు. శారద ఒక్కగానొక్కు కుమార్తె. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా శారద మాత్రం చెన్నైలో నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాదు వైద్యురాలిగా పనిచేస్తున్నారు.   ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు పెళ్లైంది. వారి సంతానమే ఉష. ఉష తాత రామశాస్త్రి చిన్న సోదరుడు గోపాలకృష్ణమూర్తి తాను తోడల్లుళ్లం అవుతామనీ సాయిపురానికి చెందిన రామ్మోహనరావు తెలిపారు. ఒక ఇంటి ఆడపడుచులనే తాము వివాహం చేసుకున్నామని చెబుతూ రీసెంట్ గా  వంశవృక్షం రూపొందించామని వివరించారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News