Tribanadhari Barbarik: ఘటోత్కచుడు కుమారుడి చరిత్రపై మూవీ.. గ్లింప్స్‌తోనే మైండ్ బ్లోయింగ్

Tribanadhari Barbarik Glimpse: మహాభారతం ఆధారంగా మరో సినిమా రానుంది. ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ మీద త్రిబాణధారి బార్బరిక అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉందంటూ నెటిజన్స్ అంటున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 6, 2024, 07:07 PM IST
Tribanadhari Barbarik: ఘటోత్కచుడు కుమారుడి చరిత్రపై మూవీ.. గ్లింప్స్‌తోనే మైండ్ బ్లోయింగ్

Tribanadhari Barbarik Glimpse: ప్రస్తుతం ఆడియన్స్‌ మైథలాజికల్ కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. మేకర్స్ కూడా ఎక్కువగా రామాయణ, మహాభారతాల్లోని పాత్రలన స్పూర్తిగా తీసుకుని సినిమాలను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) మీదో ఓ కొత్త సినిమా రానుంది. త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read: Revanth Reddy: నవంబర్‌ 14న విద్యార్థులకు శుభవార్త చెబుతా: రేవంత్‌ రెడ్డి

ఎవరు తాతా ఇతను..? ప్రపంచం గుర్తించని ఒక గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా..? తాతా.. హహ కాదమ్మా.. అంటూ ఓ ఇంట్రెస్టింగ్‌ డైలాగ్‌ను మోషన్ పోస్టర్‌లో వదిలారు. ఎలివేషన్స్, ఆర్ఆర్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అన్ని అదిరిపోయేలా ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు అర్థమవుతోంది. ఏకకాలంలో మూడు బాణాలు సంధించడం మనం బాహుబలి మూవీలో చూశాం. ఇలా ఒకేసారి మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి. అందుకే ఈ సినిమాకు త్రిబాణధారి అని టైటిల్‌లోనే పెట్టారు. ప్రస్తుత కాలానికి తగినట్లు తుపాకులు, బుల్లెట్లు కూడా చూపించారు. ఆ కాలానికి, ఈ కాలానికి కథను లింక్ చేసి ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లో థీమ్ మ్యూజిక్‌ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

ఈ సినిమాలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్ వర్క్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పున్న బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. రామ్ సుంకర పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

టెక్నికల్ టీమ్

==> బ్యానర్: వానర సెల్యూలాయిడ్ 
==> రైటింగ్, డైరెక్షన్ : మోహన్ శ్రీవత్స 
==> ప్రొడ్యూసర్ : విజయపాల్ రెడ్డి ఆదిదల 
==> సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
==> DOP : కుశేందర్ రమేష్ రెడ్డి
==> మ్యూజిక్ : ఇన్ఫ్యూషన్ బ్యాండ్
==> ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
==> ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
==> ఫైట్స్ : రామ్ సుంకర
==> కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
==> PRO : సాయి సతీష్

Also Read: Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News