Ponguleti Bomb: పొంగులేటి మరో బాంబు వార్త.. ఈసారి ఆటమ్ బాంబ్ పేలబోతుంది

Once Again Ponguleti Srinivasa Reddy Bomb Comments: దీపావళి ముందు రాజకీయ బాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్‌ బాంబ్‌ పేలుతుందని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 7, 2024, 08:34 PM IST
Ponguleti Bomb: పొంగులేటి మరో బాంబు వార్త.. ఈసారి ఆటమ్ బాంబ్ పేలబోతుంది

Ponguleti Bomb Comments: విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాంబు పేలుడు ప్రకటన సంచలనం రేపగా.. దీపావళి పండుగ ముగిసి వారం దాటినా ఎలాంటి రాజకీయ బాంబు పేలుడు లేకపోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. పొంగులేటి చేసిన ప్రకటన రాజకీయంగా నవ్వులపాలవగా.. దానిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే స్థాయిలో పొంగులేటి బాంబు ప్రకటన చేశారు. ఈసారి అలాంటి ఇలాంటి బాంబు ఉండదని.. ఆటం బాంబు పేలుతుందని ప్రకటించారు.

Also Read: KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ సంచలన ప్రకటన

వర్దన్నపేటలో గురువారం జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. *గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకుంటున్నారు. రాజకీయ బాంబు పేలబోతుందని నేను చేసిన వ్యాఖ్యలను చూసి నవ్వారు. పేలబోయేది నాటు బాంబ్ కాదు.. లక్ష్మీ బాంబ్ కాదు ఆటమ్ బాంబు పేలబోతుంది' అని తెలిపారు. ఎవరు అనేది తాను కానీ, ముఖ్యమంత్రి కానీ పేర్లు చెప్పలేదని వివరించారు.

Also Read: Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే

'తప్పుచేసిన వారిని చట్టం వదిలి పెట్టదు. నేను కానీ.. ముఖ్యమంత్రి కానీ ఎవరి పేరు ప్రకటించలేదు. తప్పు చేయకపోతే మీకు అంత ఉలిక్కిపాటు ఎందుకు?' అని పొంగులేటి ప్రశ్నించారు. 'మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తన పని తాను చేసుకుంటది' అని తెలిపారు. 'రూ.55 కోట్ల పేదల సొమ్ము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయట పడతాయి. అవి ఎవరు తీసుకున్నారో బయట పెడతాం' అని ప్రకటించారు.

'పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారు' అని పొంగులేటి నిలదీశారు. రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. తప్పు చేయనివాళ్లకు ఏమీ కాదని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన పంట రుణమాఫీని డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని మరోసారి గడువు పొడిగించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News