/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

ktr fires on cm revanth reddy: తెలంగాణ ప్రస్తుతం రాజకీయాలు రసవత్తంగా మారాయని చెప్పుకొవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నేతల్ని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను నోటికొచ్చినట్లు పొట్టు పొట్టు తిట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గులాబీ దళపతి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ తిట్లు తనకు కూడా వచ్చని సెటైర్ లు వేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్ వట్టి డొల్ల అంటూ కూడా చెప్పుకొవచ్చు. ప్రజలు కూడా కాంగ్రెస్ పైన తిక్కమీద ఉన్నారని చెప్పుకొవచ్చారు. ఎన్నికల్లో అమలు కానీ 420 హమీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజల ముందు బొక్క బొర్ల పడిందని కూడా కేసీఆర్ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణలో భవన్ లో..మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేపథ్యంలో మాట్లాడారు.  గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు బీఆర్ఎస్ ఏవిధంగా అండగా నిలిచిందో చెప్పుకొచ్చారు. కేసీఆర్ మైనారిటీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.  మైనారిటీ పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు పెట్టారన్నారు. పేద మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.

అదే విధంగా.. 250 మైనారిటీ స్కూల్స్ ను మైనారిటీల కోసం కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్స్ కేసీఆర్ మైనారిటీ విద్యార్థులకు ఇచ్చారన్నారు.
తమ సర్కారు హయాంలో మక్కా మసీదును అద్భుతంగా రిపేర్ చేసినట్లు తెలిపారు. కోకాపేటలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ను 40 కోట్లతో డెవలప్ మెంట్ చేసినట్లు పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మైనారిటీ డెవ్ లప్ మెంట్ కోసం 10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారన్నారు. ముస్లిం పేద ఆడబిడ్డల పెళ్లి కోసం షాదీ ముబారక్ ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా.. ఇమామ్ లకు ప్రతి నెల 10 వేలు ఇచ్చామని, తెలంగాణలో.. మైనారిటీలకు  డిప్యూటీ సీఎం, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు.. ఇచ్చిన హమీలను..పక్కన పెట్టి మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ మైనారిటీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిందని, మైనారిటీ డిక్లరేషన్ పేరుతో మైనారిటీలకు 4000 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయంను సైతంగుర్తు చేశారు. అంతేకాకుండా.. మైనారిటీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.

ఇంకా మైనారిటీలకు..  యువ వికాసం పేరుతో పీ.హెచ్.డి. పూర్తి చేసిన వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని,  కేసీఆర్ పాలనలో ఒక్క గంట హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేదని, ఇప్పుడు నగరంలో క్రైమ్ రేటు పెరిగిపోయిందన్నారు.

Read more: KCR Vs CM Revanth Reddy: రాత్రి మొదలు పెడితే తెల్లందాక తిడ్తా.. సీఎం రేవంత్‌కు దిమ్మతిరిగే పంచ్‌లు వేసిన గులాబీ బాస్..

పండగలు వస్తున్నాయంటే... హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ పెట్టిన విషయంను గుర్తు చేశారు. రేవంత్ ఒక చిచోరా సీఎం అంటూ.. కూడా కేటీఆర్ రెచ్చిపోయారు. కేసీఆర్ తిరిగి సీఎం కావడానికి ముస్లిం మైనారిటీల మద్దతు ఇవ్వాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
ktr comments on minorities welfare schemes implemented in past brs govt and fires on cm revanth reddy details pa
News Source: 
Home Title: 

KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?
 

KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?
Caption: 
cmrevanthreddy(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సీఎం రేవంత్ ను ఏకీపారేసిన కేటీఆర్..  

మైనారిటీలకు మాజీ సీఎం పెద్దపీట వేశారని వ్యాఖ్యలు..
 

Mobile Title: 
KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..అసలేం..
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Monday, November 11, 2024 - 13:20
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
11
Is Breaking News: 
No
Word Count: 
384