Ex cm kcr fires on cm revanth reddy: మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగినట్లు తెలుస్తొంది. సిద్దిపేటలోని పాలకూర్తీలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పరిస్థితి తెలిసి పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం మన ప్రభుత్వమే వస్తుందంటూ కూడా జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ తన ప్రతిసారి నోరు పారేసుకుంటూ ఇష్టమున్నట్లు దిగజారీ మాట్లాడుతున్నారని, అలాంటి తిట్లు నాకు వస్తుందని, రాత్రి మొదలెడితే.. తెల్లందాక తిట్టగలనని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్ ను అదే మూసీలో ప్రజలు ముంచేస్తారని మాజీ సీఎం అన్నారు. అంతే కాకుండా.. ప్రజలు కూడా కాంగ్రెస్ తీరుపట్ల ఎంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. హైడ్రా కూల్చివేతలపై కూడా గులాబీబాస్ ఖండించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. బీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ కొరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ వచ్చి ఏడాదికి దగ్గర పడిందని అయిన ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చలేదన్నారు. అంతే కాకుండా..కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ లు చేయడం, భయపెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తుందన్నారు. అంతే కానీ ప్రజలకు మంచి చేయాలని కూడా చూడలేదన్నారు. అంతే కాకుండా.. ప్రభుత్వం నిర్ణయాలు.. నిర్మాణాత్మకంగా ఉండాలని.. ప్రతీకార దిగజారుడు రాజకీయాలు చేయోద్దని హితవు పలికారు. గత ఎన్నికలలో పదిశాతం చెప్పి.. అధికారంలోకి వచ్చాక 90 శాతం మంచి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం.. 100 శాతం హమీలు ఇచ్చి.. కనీసం 5 శాతం కూడా పనులు చేయలేదని ఎద్దేవా చేశారు.
Read more: CM Revanth Reddy: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి హావా.. సంచలన ప్రెస్ మీట్.. ఏమన్నారంటే..?
అయితే.. కేసీఆర్ మాత్రం చాలా రోజుల తర్వాత ఈరోజు బైటకు వచ్చి కేసీఆర్ మాట్లాడటం రాజకీయాల్లో రచ్చగా మారిందని తెలుస్తొంది. అయితే.. తెలంగాణలో తోందరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలుస్తొంది. ఈ క్రమంలో మాజీ సీఎం రేవంత్ ను ఏకీ పారేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు.. సీఎం రేవంత్... నిన్న కేసీఆర్, కేటీఆర్ లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం రేవంత్ సర్కారును విమర్శించడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.