KTR Arrest: గవర్నర్‌ అనుమతిస్తే కేటీఆర్‌ అరెస్ట్‌ పక్కా: రేవంత్‌ రెడ్డి సంచలనం

We Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్‌ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పక ఉంటదని రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 13, 2024, 12:18 AM IST
KTR Arrest: గవర్నర్‌ అనుమతిస్తే కేటీఆర్‌ అరెస్ట్‌ పక్కా: రేవంత్‌ రెడ్డి సంచలనం

KT Rama Rao Arrest: ఈ రేసులో నిధుల బదలాయింపుపై లేనిపోని వాస్తవాలు చెబుతున్న రేవంత్‌ రెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఈ రేసుపై గవర్నర్‌కు లేఖ రాశామని.. ఆయన అనుమతి రాగానే విచారణ చేపట్టి కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా తన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేశారు. ఏమైనా చేసుకోండి అంటూ సవాల్‌ విసిరారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Vikarabad Collector: కలెక్టర్ దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

ఢిల్లీ పర్యటనలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అవినీతి చిట్టా విప్పడంతో అదే ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి స్పందించారు. రాత్రివేళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ రేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారు. గవర్నర్‌ అనుమతి నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్‌ ఢిల్లీలో ఉన్నారు' అని వివరించారు. గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: Harish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండు

కుటుంబ కుంభకోణంపై..
తన కుటుంబం అమృత్‌ టెండర్లలో కుంభకోణం చేసిందని కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. 'అమృత్‌ టెండర్లపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రెడ్డి పేరు ఉన్నంత మాత్రాన నా బంధువులు కాదు. సృజన్‌ రెడ్డి గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి అల్లుడే. ఈ టెండర్ల గురించి ఇష్టమొచ్చిన చోట మొరపెట్టుకో. న్యాయస్థానాల్లో కేసులు కూడా వేసుకోండి' అని రేవంత్‌ తెలిపారు.

అంతకుముందు ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన సదస్సులో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా జనాభా పెరుగుదల, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. 'ప‌దేళ్ల‌లో మోదీ ఈ దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేశారో చెప్ప‌గ‌లిగాం. రాజ్యాంగం ర‌ద్దుకు మోదీ ప్ర‌భుత్వం ఎలా ప్ర‌య‌త్నించింది మేం చెప్ప‌గ‌లిగాం. బీజేపీ ర‌హ‌స్య జెండాను బ‌య‌ట‌పెట్టాం' అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఫార్మాట్ మార్చుకోవాలని హితవు పలకాలని చెప్పి సంచలనం రేపారు. కాంగ్రెస్ నాయ‌కులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని.. ఇప్పుడు 20-20 ఫార్మాట్ ఆడాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x