ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా చెన్నై బ్యూటీ త్రిష తన స్టార్ స్టేటస్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. అయితే ఇటీవలి కాలంలో ఆమెకు తెలుగులో సినిమాలు లేకపోవడం, సక్సెస్ అనే ఊసే లేకపోవడంతో అంతా త్రిష పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి త్రిషకు దాదాపు 10 సినిమాలకు ఒప్పందం చేసుకుందని సమాచారం. ఒక తెలుగు, మలయాళం సినిమాలతో సహా 8వరకు తమిళ సినిమాలకు త్రిష ఒప్పుకున్నారట.
Also Read: భర్త మంచివాడే, కానీ.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు
ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియాలో త్రిష ఇంటరాక్ట్ అయింది. అందరూ హీరోయిన్లును అడిగే ప్రశ్నే ఈమెకు ఎదురైంది. అదేనండీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా లాంటి ప్రశ్నలను ఫ్యాన్స్ అడిగగా నటి ఏమాత్రం ఆలచించకుండా జవాబిచ్చింది. తనకు నచ్చిన మగాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటానని, అయితే పెళ్లి మాత్రం లాస్ వెగాస్ (అమెరికా)లో చేసుకుంటానని స్పష్టం చేసింది. అదే సమయంలో తనకు వివాహ వ్యవస్థపై అంతగా నమ్మకం లేదని చెప్పడం గమనార్హం.
See Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు
కాగా, 2015లో పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని రోజులకే అది పెళ్లివరకు వెళ్లడం లేదని త్రిష కన్ఫామ్ చేసింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో డేటింగ్ చేసిందంటూ వదంతులు సైతం త్రిషపై వచ్చాయి. ప్రస్తుతం తమిళంలో ఫుల్ ఫామ్‌లో ఉంది త్రిష. కోలీవుడ్‌లో 8 మూవీలు చేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పుష్కరకాలం తర్వాత మరోసారి కలిసి నటించనుంది. కొరటాల శివ దర్శకుడు. మరోవైపు మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్ సెల్వన్', మోహన్‌లాల్‌తో ‘రామ్' సహా మరిన్ని ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి.