Leopard attacks on pet dog video: సాధారణంగా అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు క్రూర జంతువులు తరచుగా వస్తుంటాయి. మనం పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్లు, పాములు వంటి జీవులు గ్రామాలపైకి దాడులు చేయడం చూస్తుంటం. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాలంలో చిరుత పులులు జనావాసాల మీదకు ఎక్కువగా వస్తున్నాయి. మనిషి అడవుల్లోప్రవేశించి.. అక్కడ చెట్లను నరికివేస్తు క్రూర జంతువుల జీవనంను రిస్క్ లోకి నెట్టుతున్నాడు. దీంతో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.
ముఖ్యంగా జంతువులు ఆహారం, నీళ్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు రాత్రిపూట మాత్రమే వచ్చే జంతువులు ఇప్పుడు..పగలు కూడా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరుత పులులు మనుషుల మీదకు దాడులు చేసిన అనే ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో ఇటీవల రాజస్థాన్ లోని మౌంట్ అబులో ఒక చిరుత.. పెంపుడు శునకం మీద దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
పూర్తి వివరాలు..
రాజస్థాన్ లోని మౌంట్ అబులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక చిరుత.. అడవికి దగ్గరలోని ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ అది నల్లని లాబ్రడార్ కుక్క కాపాలాగా ఉంది. చిరుత అమాంతం కుక్క మీదకు దాడికి దిగింది. దాని పీక పట్టుకుని కదలకుండా చేసింది. దీంతో ఆ కుక్క పాపం.. విలవిల్లాడి పోయింది. చిరుత మాత్రం.. దాని పీకను వదలకుండా.. గట్టిగా పట్టుకుని పంజాతో దాడి చేయసాగింది.
కానీ కుక్క చివరకు.. ఎంతో కష్టపడి.. దాని పంజానుంచి తప్పించుకుని గట్టిగా అరిచింది. ఇంటి బైట చప్పుడు విని ఇంటి ఓనర్ బైటకు రావడంతో.. చిరుత పారిపోతుంది. ఈ చిరుత దాడి ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.