GO 16 Cancel: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్‌.. జీవో 16 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

Telangana Contract Employees GO 16 Cancelled: కొన్నేళ్ల పాటు కాంట్రాక్ట్‌తో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందామనే ఆనందం లేకుండాపోయింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునివ్వగా.. ఉద్యోగులు భారీ షాక్‌కు గురయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 19, 2024, 05:20 PM IST
GO 16 Cancel: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్‌.. జీవో 16 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

Contract Employees: తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తూ రెగ్యులరైజ్‌ కావడంతో ఆనందంలో ఉన్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేయడం కలకలం రేపింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని ఆందోళన చెందుతున్న ఉద్యోగుల భవిష్యత్‌ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.

Also Read: Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసున్న విషయం తెలిసిందే. జీవో 16 ద్వారా వేలాది మందిని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. దీంతో నాడు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సంబరాల్లో మునిగారు. ప్రస్తుతం రెగ్యులరైజ్‌ పొంది హాయిగా పని చేసుకుంటూ ఉన్నారు. విద్య, వైద్య శాఖతోపాటు అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు క్రమబద్దీకరణ పొందారు. కాగా క్రమబద్దీకరణ చేసిన జీవో 16పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు తాజాగా మంగళవారం తీర్పును ఇచ్చింది.

Also Read: KCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. 'కేసీఆర్‌' సినిమా సూపర్‌ హిట్‌ కావాలి

జీవో 16ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయితే తీర్పు ఇచ్చిన దానిలో హైకోర్టు ఒక ఊరటనిచ్చింది. 'రెగ్యులరైజ్‌ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించవచ్చు' అని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులు కాస్త మళ్లీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా మారారు.

జీఓ 16 నంబర్‌తో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో 5,544 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కాస్త ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 

క్రమబద్దీకరణ పొందిన ఉద్యోగులు

  • జూనియర్‌ లెక్చరర్లు 2,909 మంది
  • జూనియర్‌ లెక్చరర్లు (ఒకేషనల్‌) 184 మంది
  • పాలిటిక్నిక్‌ లెక్చరర్లు 390 మంది
  • డిగ్రీ లెక్చరర్లు 270 మంది
  • సాంకేతిక విద్యాశాఖలో అటెండర్లు 131 మంది
  • వైద్య ఆరోగ్య శాఖలో వైద్య సహాయకులు 837 మంది
  • ల్యాబ్‌ టెక్నీషియన్లు 179 మంది
  • ఫార్మాసిస్టులు 158 మంది
  • సహాయ శిక్షణ అధికారులు 230 మంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News