Rosy Cheeks: పింక్ బుగ్గలు పొందడానికి ఈ సింపుల్‌ చిట్కాలను పాటించండి..!

Beauty Tips For Rosy Cheeks: చబ్బీ బుగ్గలపైన గులాబీ రంగు ఉండే ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా మంది పింక్‌ బుగ్గల కోసం మార్కెట్‌లో లభించే క్రీములు, ఖరీదైనా ప్రొడెక్ట్సలను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి కెమికల్స్‌ను ఉపయోగించకుండా సహజంగా పింక్‌ బ్లష్‌ను పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 20, 2024, 11:14 AM IST
Rosy Cheeks: పింక్ బుగ్గలు పొందడానికి ఈ సింపుల్‌ చిట్కాలను పాటించండి..!

Beauty Tips For Rosy Cheeks: ప్రస్తుకాలంలో చాలా మంది మేకప్‌ ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖం అందంగా కనిపించడం కోసం వివిధ రకాల క్రీములు, ఖరీదైనా ఫౌండేషన్ లను వాడుతుంటారు. అయితే మేకప్‌లో 

భాగంగా చాలా మంది చెంపలపైన పింక్ బ్లష్‌ను ఉపయోగిస్తారు. ఇది చబ్బీ బుగ్గలను అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే చర్మ నిపుణులు ప్రకారం కెమికల్స్ ఉన్న ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. సహజంగా కూడా బుగ్గలపైన గులాబీ రంగును పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. 

పింక్ రంగు బుగ్గల కోసం చిట్కాలు: 

అందంగా కనిపించాలంటే ముందు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసకోవాల్సి ఉంటుంది. ఆహారపదార్థాలు పోషకాలు అందించడమే కాకుండా అందంగా కనిపించేలా కూడా సహాయపడుతాయి. పింక్ బగ్గుల కోసం కొన్ని ఆహారపదార్థాలు సహాయపడుతాయి. అందులో పండ్లు ఉపయోగపడుతాయి. అంజీర్‌, ద్రాక్ష వంటి పండ్లు రక్త ప్రసరణను పెంచుతాయి. ఇది రక్తంలో ఉండే మలినాలను తొలగించి మంచి రక్తని పెంచుతుంది. దీని వల్ల ఆరోగ్యకరమైన చర్మం, సహజ కాంతి పొందవచ్చు. బీట్‌రూట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు రక్తహీనతను తగ్గించి, చర్మానికి కాంతిని చేకూర్చుతాయి. నిమ్మకాయ, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ ఆహారపదార్థాలను ఉపయోగించడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

హోం రెమెడీస్:

ఆహారంతో పాటు చర్మ సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు ఒక టీ స్పూన్ గులాబీనీరుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల చర్మం పైన ఉండే మురికి, మచ్చలు తగ్గుతాయి. అయితే గులాబీ నీరు మాత్రమే కాకుండా అందంను పెంచడంలో తులసి ఆకులు కూడా సహాయపడుతాయి. ఈ ఆకులతో తయారు చేసే ఫేస్‌ ప్యాక్‌ ముఖంను శుభ్రం చేయడంతో పాటు మురికి చేరకుండా చేస్తాయి. 
 టొమాటో పల్ప్‌ను ముఖానికి రాసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా అవుతుంది. మసూర్ దాల్‌ను నానబెట్టి మెత్తగా రుబ్బి ముఖానికి ప్యాక్‌లా పెట్టుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచి, రంగును మెరుగుపరుస్తుంది.

మరొకటి:

పెద్ద మొత్తంలో నీరు తాగండి: నీరు శరీరంలోని విషాన్ని తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యకాంతిని తప్పించుకోండి: ఎండలో తిరిగినప్పుడు ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ వాడండి. సరిపడా నిద్ర పోవడం చర్మానికి చాలా ముఖ్యం.

గమనిక: ఈ చిట్కాలు సాధారణంగా సురక్షితమైనవి అయినప్పటికీ, మీకు ఏదైనా అలర్జీ ఉంటే, వాడే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.

ఇదీ చదవండి: ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News