Maharashtra Exit Poll: మరాఠా గడ్డపై మళ్లీ ఆ కూటమిదే అధికారం? ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇవే!

Maharashtra Exit Poll 2024 Live Mahayuti Or Mahagathbandhan: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న మహారాష్ట్ర గడ్డపై మళ్లీ జెండా ఎగరవేసేది ఎవరు? స్పష్టంగా ఒక పార్టీకి ఇచ్చారా? లేదంటే మళ్లీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికారా అనేది తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 20, 2024, 07:02 PM IST
Maharashtra Exit Poll: మరాఠా గడ్డపై మళ్లీ ఆ కూటమిదే అధికారం? ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇవే!

Maharashtra Poll Prediction: దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే రాష్ట్రమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అధికారం కోసం సాగిన రాజకీయ చదరంగంలో ప్రస్తుతం మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. లోక్‌సభ ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చిన మహారాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Maharashtra assembly election 2024: మహా సంగ్రామం షూరూ.. మహా యుతి వర్సెస్ మహా అఘాడీ..

మహారాష్ట్రలో
దేశ ఆర్థిక శక్తికి వెన్నెముకగా ఉన్న మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఎన్నికల్లో సంకీర్ణానికి ప్రజలు మద్దతు తెలపగా ఈసారి ఎవరి పక్షం ఉన్నారో అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ జరగ్గా ఇక్కడ రెండు ప్రధాన మహాయుతి, మహా వికాస్‌ అఘాడీ కూటములు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలో ఉంది. తిరిగి తన సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. 

Also Read: Anmol Bishnoi Arrest: లండన్ లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అరెస్ట్..

ఎన్నికల్లో ప్రధాన పార్టీల పోటీ ఇలా

ఎన్డీయే కూటమి
288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్‌ - 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మహావికాస్ అఘాడీ (ఇండి కూటమి)
కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్‌ 86 సీట్లలో పోటీ

 

ఎగ్జిట్ ఫలితాలు ఇలా..
చాణక్య

బీజేపీ కూటమి 152-160 స్థానాలు
కాంగ్రెస్‌ కూటమి 132-138 స్థానాలు

పీపుల్స్‌ పల్స్‌
మహాయుతి

బీజేపీ 102 నుంచి 120 సీట్లు
శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం 42 నుంచి 61 సీట్లు
ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం 14 నుంచి 25 సీట్లు

మహావికాస్‌ అఘాడీ
కాంగ్రెస్‌ పార్టీ 24 నుంచి 44 స్థానాలు
శివసేన ఉద్దవ్‌ థాక్రే వర్గం 21 నుంచి 36 సీట్లు
ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి 28 నుంచి 41 సీట్లు

టైమ్స్‌ నౌ

బీజేపీ కూటమి
కాంగ్రెస్‌ కూటమి

ఇండియా టుడే
బీజేపీ కూటమి
​కాంగ్రెస్‌ కూటమి

ఆత్మసాక్షి
బీజేపీ కూటమి
​కాంగ్రెస్‌ కూటమి

పీపుల్స్‌ పల్స్
బీజేపీ కూటమి
​కాంగ్రెస్‌ కూటమి

జీ తెలుగు
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను జీ మీడియా సరికొత్తగా ఏఐ టూల్‌తో చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవ ఫలితాలకు చేరువగా చెప్పి అందరి దృష్టి ఆకర్షించిన జీనియా మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలపై కూడా అంచనా వేసింది.
జీనియా
ఎన్డీయే కూటమి

మహావికాస్ అఘాడీ (ఇండి కూటమి)
కాంగ్రెస్ , శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్‌పవార్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News