Maharashtra And Jharkhand Poll Results: ఆదివాసీల అడ్డాలో గెలిచేదెవరు? మరాఠా అధికార పీఠంపై కూర్చునేది ఎవరు? దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఈసారి అధికారం ఎవరిదనేది తేలిపోయింది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికార కూటములకే అక్కడి ఓటర్లు పట్టం కట్టారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సెంచరీ మార్క్ కొట్టేసింది. 220కు పైగా స్థానాల దిశగా మహాయుతి కూటమి దూసుకొచ్చింది. జార్ఖండ్ లో జేఎంఎం పార్టీ నేతృత్వంలో కూటమి విజయ దుందుంభి మోగించింది. దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ఫలితాలు ఆసక్తిగా మారాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటికి విజయం ఖరారైంది. ఎవరికి ఎన్ని స్థానాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫలితాలతో బీజేపీ జోష్ లో ఉండగా.. కాంగ్రెస్ కు మాత్రం కొంత మోదం ఖేదం వంటి పరిస్థితి ఏర్పడింది. ఓట్ల లెక్కింపు అప్డేట్స్ నిమిష నిమిషానికి ఎన్నికల ఫలితాలు అందిస్తున్నాం.