Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?

Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 27, 2024, 04:36 PM IST
Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?

Red Color Lizards: సృష్టిలో విషపూరితమైన జంతువులు పాములేనని అందరూ భావిస్తారు. కానీ పాముల కన్నా అత్యధికంగా విషపూరితమైన జంతువులు చాలానే ఉన్నాయి. వాటిలో మన ఇంట్లో కనిపించే బల్లులు కూడా ఉన్నాయి. బల్లుల్లో కొన్ని రకాల బల్లులు చాలా చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఆ బల్లులను ముట్టినా కూడా విషం పాకి చనిపోయేంత స్థాయిలో కూడా ఉన్నాయి. అలాంటి బల్లులు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లభించాయి. అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: Tirumala: అల్లరల్లరి అవుతున్న తిరుమల.. ప్రాంక్‌ వీడియోలకు అడ్డాగా క్షేత్రం

విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించన ప్రయాణికులను బుధవారం పోలీసులు పరిశీలించారు. ఈ సమయంలో థాయిలాండ్ నుంచి విషపూరితమైన బల్లులు అక్రమంగా రవాణా చేస్తున్నారని గుర్తించారు. థాయిలాండ్ నుంచి విశాఖ వచ్చిన అరుదైన థాయిలాండ్ బల్లులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి వారిని అరెస్ట్‌ చేశారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు తరలిస్తున్నారు? ఎందుకోసం వాటిని విశాఖకు తీసుకొచ్చారనే వివరాలను పోలీసులు కూపీ లాగుతున్నారు. 

ఇది చదవండి: Shamshabad Airport: వామ్మో.. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో డెంజరస్ పాములు.. మరీ అక్కడ పెట్టి.. వీడియో ఇదిగో..

 

అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అక్కడి భద్రతా సిబ్బంది పిర్యాదు చేసింది. స్నేక్‌ సేవర్‌ను ఎయిర్‌పోర్టుకు పిలిపించి అధికారుల సమక్షంలో అరుదైన జాతికి చెందిన సుమారు 6 బల్లులను బయటకు తీశాడు. ఆ బల్లులు చాలా విషపూరితమైనవిగా స్నేక్‌ సేవర్‌ తెలిపాడు. దీంతో అధికారులు భయాందోళన చెందారు. పరిశీలించిన అనంతరం తిరిగి వాటిని బ్యాంకాక్‌కు తరలించినట్లు సమాచారం. నీలం రంగు నాలుక కలిగిన బల్లుల శాస్త్రీయ నామం టిలిక్యూ సైనోకాయిడ్స్‌ అని ఉంది. ఈ బల్లులు ఆస్ట్రేలియాకు చెందినవని.. అక్కడ ఇవి కనిపిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆ బల్లులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు వన్యప్రాణుల రవాణాకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. గతంలో కూడా ఇలా అరుదైన వన్య ప్రాణులను విశాఖకు తరలిస్తుండగా పోలీసులు వెంటనే స్పందించి అదుపులోకి తీసుకువచ్చారు. వన్యప్రాణులను ఎందుకు విశాఖకు తరలిస్తున్నారనే చర్చ మొదలైంది. ఏదైనా మాఫియా.. లేదా వన్యప్రాణులతో ఏదైనా ప్రయోగాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే వన్యప్రాణుల రవాణా చేస్తున్న ముఠా.. విక్రేతలు.. కొనుగోలుదారులపై చర్యలు తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు. దేశానికి ప్రమాదకరమైన వన్యప్రాణులను తరలించడం చట్టరీత్యా నేరం. అత్యంత విషపూరిత ప్రాణులను తీసుకురావాలంటే ప్రత్యేక అనుమతి ఉండాల్సి ఉంది. అలా లేని పక్షంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News