Allu Arjun: అల్లు అర్జున్ పుష్పకి ఎన్ని కష్టాల.. వెనక పెద్ద మాస్టర్ ప్లాన్..?

Puspa 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పై తాజాగా ఫిర్యాదు నమోదవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుష్ప2 సినిమా రిలీజ్ టైం లో.. ఇలాంటి ఘటన అల్లు అర్జున్ కి కూడా చేదు అనుభవాన్ని మిగులుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలో పుష్ప సినిమాని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ అల్లు అభిమానులు వాపోతున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 30, 2024, 06:58 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ పుష్పకి ఎన్ని కష్టాల.. వెనక పెద్ద మాస్టర్ ప్లాన్..?

Pushpa 2 controversy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2.. సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా వేగంగా చేపట్టారు చిత్ర బృందం. 

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా తన ఆర్మీ ఉందని, తన ఆర్మీ తనను కాపాడుతుందని చెప్పుకుంటున్న సమయంలో సడన్ గా ఈయనకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. తాజాగా ఈయనపై.. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్థం లేకుండా.. అల్లు అర్జున్ చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ముఖ్యంగా దేశ నియమ నిబంధనలను పాటించడం లేదు అంటూ ఆయనపై.. తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని, దీనిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు తమ ఫిర్యాదులో తెలిపారు. అయితే ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇలా పెట్టుకున్న.. కావాలని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడంపై అల్లు అభిమానులు మందిపడుతున్నారు.

మరోపక్క పుష్ప సినిమా గురించి.. కొన్ని పేజీలు సోషల్ మీడియాలో తెగ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నాయి అని వాపోతున్నారు. ముఖ్యంగా పుష్ప టికెట్ రేట్ల గురించి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొంతమంది.. అసలు అంత డబ్బు పెట్టి ఎవరన్నా సినిమాని చూస్తారా..? కాబట్టి సినిమా టికెట్ రేట్ తగ్గే వరకు చూడకుండా ఉండడమే మంచి ఆప్షన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇవన్నీ.. తమని టార్గెట్ చేసిన మెగా అభిమానులు చేస్తున్న పనులు అంటూ.. కావాలనే పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ తగ్గించడానికి.. కొంతమంది సోషల్ మీడియాలో పుష్ప పైన.. తులం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటూ వాపోతున్నారు అల్లు అభిమానులు.

పుష్ప విడుదల దగ్గర పడుతున్న సమయంలో.. ఇలా కావాలని అల్లు అర్జున్ పై కేసులు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అనేది వారి వాదన. మరి నిజంగానే వీటన్నిటి వెనుక.. అల్లు అర్జున్ అంటే పడని అభిమానుల మాస్టర్ ప్లాన్ ఉందా.. లేదా అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేము. మొత్తానికి పుష్ప సినిమాకి మాత్రం కష్టాలు తప్పడం లేదు. కాగా మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా.. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ సీన్స్ గురించి కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో భాగం విడుదలయ్యాక.. పరిస్థితి ఏమిటో వేచి చూడాలి.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News