Balineni Srinivasa Reddy: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే వైసీపీకి గుడ్‌బై చెప్పారు. జగన్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన బాలినేని.. ఎట్టకేలకు జనసేన కండువా కప్పుకున్నారు. జగన్‌కు అత్యంత క్లోజ్‌గా ఉండే బాలినేని పార్టీ మారడంతో నేతలంతా షాక్ అయ్యారు. అంతేకాదు జగన్‌కు సమీప బంధువు కావడంతో ఆయన పార్టీ ఎందుకు మారారని నేతలంతా చర్చోపచర్చలు సాగించారు. అయితే మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయడాన్ని బాలినేని అస్సలు జీర్ణించుకోలేకపోయారట. అందుకే ఆయన జనసేన పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ కీలక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకేఒక్క మంత్రి సీటు ఖాళీగా ఉండటంతో.. బాలినేనికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్. 1999 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకు 5 సార్లు ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో రెండేళ్లు మంత్రిగా కొనసాగారు. అయితే మంత్రివర్గం నుంచి జగన్ భర్తరఫ్ చేయగానే ఆయన టీడీపీలో చేరాలని భావించారట. కానీ తన దరిద్రం కొద్ది టీడీపీలోకి వెళ్లలేదని అనుచరుల దగ్గర అప్పట్లో వాపోయారట. అప్పుడే టీడీపీలో చేరివుంటే.. ఇప్పుడు మంత్రిగా మరోసారి సేవచేసే చాన్స్దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు గతంలో జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.
వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చాలా సైలెంట్ ఉంటారు. అవసరమైతే తప్ప ఏదీ మాట్లాడరని అనుచరులు చెబుతుంటారు. ప్రతిపక్ష నేతలను తిట్టింది కూడా తక్కువే. కానీ తాజాగా వైసీపీ నేతలను బాలినేని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌తో పాటు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్‌గా బాలినేని పదునైన విమర్శలు చేశారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమెరికా లీలలను భయటపెడతానంటూ హెచ్చరించారు. దాంతో అసలు విషయం పక్కకుపోయి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమెరికా సీక్రెట్ ఏంటనే సరికొత్త చర్చ మొదలైంది. తాజాగా బాలినేని కామెంట్స్ తర్వాత.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల మాజీమంత్రి బాలినేని జనసేన కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ కీలక హామీ ఇచ్చారని తెలుస్తోంది. బాలినేని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఓ కమ్మ, ఓ కాపు నేతకు మంత్రివర్గంలో చోటు దక్కింది. రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత లేదు. కాబట్టి బాలినేని మంత్రి పదవి ఇప్పిస్తే రెడ్డికి కూడా పదవి ఇచ్చినట్టు అవుతుందని పవన్ భావిస్తున్నారట. అయితే బాలినేనికి మంత్రిపదవి విషయమై సీఎం చంద్రబాబును పవన్ కలిసే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఓ ప్రకటన వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు.
Also Read: Diabetes : రాత్రి పడుకునే ముందు పాలలో ఈ పొడి కలిపి తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండటం ఖాయం
Also Read: Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా లేదా, ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.