Senagapindi: ముఖానికి శనగ పిండి ఇలా పెట్టి చూడండి.. మచ్చలేని తెల్లని చర్మం పొందండి..

Senagapindi In Skincare: ముఖం మెరుగు చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు.  స్కిన్ కేర్ రొటీన్ లో వేల రూపాయలు ఖర్చుపెట్టి ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు... అయితే ముఖం పైన యాక్నే, పొడిబారడాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా శనగపిండితో ముఖ ఛాయను ఎలా మెరుగుపరుచుకోవచ్చు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 6, 2024, 01:47 PM IST
Senagapindi: ముఖానికి శనగ పిండి ఇలా పెట్టి చూడండి.. మచ్చలేని తెల్లని చర్మం పొందండి..

Senagapindi In Skincare:  మన పూర్వీకుల కాలం నుంచి సెనగ పిండిని సౌందర్యపరంగా ఉపయోగిస్తారు. శనగపిండిలో ముఖానికి మాయిశ్చర్‌ ఇచ్చే గుణాలు ఉంటాయి... ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉండే పదార్థం. అంతేకాదు దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఏ స్కిన్ కేర్ రొటీన్ మీరు ప్రారంభించినా... ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకూడదు.

ముఖానికి శనగపిండి అప్లై చేయడం వల్ల ముఖం రంగు మెరుగు పడుతుంది. ఆ తర్వాత ముఖంపై ఉన్న అదనపు నూనెను గ్రహించేస్తుంది... ముఖానికి మాయిశ్చర్ అందించే గుణాలు కూడా శనగపిండిలో పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి ఈవెన్‌ స్కిన్ టోన్ అందిస్తుంది... మీ రెగ్యులర్ రొటీన్ లో శనగపిండిని అప్లై చేయడం వల్ల మీ చర్మం తెల్లబడుతుంది. దీంతో మీ స్కిన్ టోన్ మెరుగయ్యి ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు తొలిగిపోతాయి. ఎలాంటి కెమికల్స్ వాడకుండానే ముఖం సహజంగా మెరిసిపోతుంది.

అంతేకాదు కొన్ని కొంతమంది నల్ల మచ్చలతో బాధపడుతుంటారు. ముఖంపై ఇలాంటి మచ్చలు ఉండటంవల్ల అందవిహీనంగా కనిపిస్తారు... ముఖంపై నల్ల మచ్చలు, గీతాలు తగ్గించుకోవాలంటే శనగపిండిని ఉపయోగించండి. ఇది ముఖానికి పునర్జీవనం అందిస్తుంది. శనగపిండిలో పాలు వేసి ముఖానికి అప్లై చేసిన ముఖానికి ఈవెన్ స్కిన్‌ టోన్‌ వస్తుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలు గీతలు తొలగిపోయి త్వరగా గ్లో గా కనిపిస్తుంది.

అంతేకాదు శనగపిండిలో ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మన చర్మంపై ఉన్న డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగించేస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది మీ డైలీ బ్యూటీ రొటీన్ లో శనగపిండిని ఉపయోగించిన మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీరు శనగపిండితో స్క్రబ్ చేసుకోవడం వల్ల జీవం లేని మీ చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది. మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీ ముఖం చూడటానికి కూడా తాజాదనంతో కనిపిస్తుంది.

 ఒమేగా 3 పుష్కలంగా ఉండే ఈ పండు తింటే మీ గుండె సేఫ్.. మెదడు భేష్..

శనగపిండిని మీ డైలీ బ్యూటీ రొటీన్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మీ ముఖంపై మంచి ఫలితాలు కనిపిస్తాయి... మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. నేచురల్ గా  అందమైన లుక్ ని పొందండి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖంపై ఆయిల్ ఎక్కువగా ఉన్నవాళ్లు శనగపిండిలో పాలకు బదులుగా రోజ్ వాటర్ ను ఉపయోగించాలి. దీంతో ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. లేదంటే రోజ్ వాటర్ శనగపిండి ,కొద్దిగా పసుపు వేసి ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. దీంతో మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి మూడుసార్లు ఉపయోగించాలి. ఆరిన తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో మెరిసే ముఖం మీ సొంతం.

ఇదీ చదవండి: Rice Bugs: బియ్యం డబ్బాలో పురుగు పట్టిందా? ఈ చిన్ని చిట్కాతో ఎప్పటికీ రావు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News