Diabetic Precautions: చలికాలంలో డయాబెటిక్ రోగులు ఈ పొరపాట్లు చేయకూడదు

Diabetic Precautions: ఆధునిక జీవన విధానంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2024, 08:38 PM IST
Diabetic Precautions: చలికాలంలో డయాబెటిక్ రోగులు ఈ పొరపాట్లు చేయకూడదు

Diabetic Precautions: మరీ ముఖ్యంగా చలికాలంలో డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. చలికాలంలో తినే ఆహారపు అలవాట్లలో మార్పులు, వాతావరణం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ మారుతుంటాయి. అందుకే చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్ధాలతో దూరం పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.

ప్రతి ఐదుగురిలో ఇద్దరికి డయాబెటిస్ ఉంటుందంటే ఏమాత్రం అతిశయోక్తి కానేకాదు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా మధుమేహం సోకుతోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మారిపోతున్నాయి. మధుమేహానికి ఇప్పటికీ పూర్తి చికిత్స లేదు. నియంత్రణ మాత్రం సాధ్యమే. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి తినాలి, ఏవి తినకూడదనేది పూర్తిగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో చాలా కేర్ తీసుకోవాలి. 

శీతాకాలంలో ఫాస్ట్ ఫుడ్స్, అరటి పండ్లు, స్వీట్స్ అస్సలు తినకూడదు. రాత్రి వేళ అస్సలు ముట్టకూడదు. ఇక ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులు హెవీ డైట్ తీసుకోకూడదు. బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. 

ఇక వ్యాయామం లేదా వాకింగ్ చాలా అవసరం. చలి కారణంగా వ్యాయామానికి దూరం కాకూడదు. శారీరక శ్రమ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజుకు కనీసం 2 కిలోమీటర్ల నడక ఉండాల్సిందేనంటున్నారు వైద్యులు. శారీరక శ్రమ ఉండేట్టు చూసుకోవాలి. ఇక మధుమేహం మందుల్ని సమయానికి వేసుకోవాలి. మందుల వేసుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు. 

Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News