2024 Google Top Searches: గూగుల్ ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఆ సంవత్సరం మొత్తం ప్రజలు ఏ విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారో చూపించే ఒక జాబితాను విడుదల చేస్తుంది. దీన్ని "Google Year in Search" అని అంటారు. ఈ జాబితా వల్ల ఆ సంవత్సరం ప్రజల మనసుల్లో ఏముంది? ఏ విషయాలు వారిని ఎక్కువగా ఆకట్టుకున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జాబితా వల్ల భవిష్యత్తులో ఏ రకమైన ఉత్పత్తులు, సేవలు అవసరమవుతాయో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఏ జాబితాలో ఏముంటుంది అంటే.. వంటకాలు: ఏ రకమైన వంటకాలు ఎక్కువగా వెతికారు?, ప్రదేశాలు: ప్రజలు ప్రయాణించడానికి ఇష్టపడే ప్రదేశాలు ఏవి?, వ్యక్తులు: ఏ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా వెతికారు?, ఉత్పత్తులు: ఏ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలు కోరుకున్నారు?, సంఘటనలు: ఏ సంఘటనలు ప్రపంచాన్ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి?, సేవలు: ఏ సేవల గురించి ఎక్కువగా వెతికారు? ఈ జాబితాలను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది.
ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వంటల గురించి సెర్చ్ చేశారు. ముఖ్యంగా అందులో మన భారతీయులు వివిధ రకాల రెసిపీలను సెర్చ్ చేసినట్లు తెలుసోంది. 2024లో భారతీయులు ఎక్కువగా ఎరకమైన రెసిపీలు సెర్చ్ చేశారు. ఏ వంటలను అధికంగా సెర్చ్ చేశారు ఏంటో తెలుసుకుందాం.
2024 గూగుల్ సెర్చ్ చేసిన రెసిపీలు:
మామిడికాయ పచ్చడి: దక్షిణ భారతదేశంలో మామిడి ఊరగాయ ప్రజలకు ఇష్టమైన ఆహారం. 2024లో టాప్ సెర్చ్ జాబితాలో మామిడి పచ్చడి రెండవ స్థానంలో ఉంది.
ఉగాది పచ్చడి: ఉగాది పచ్చడి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన పచ్చడి. దీని ఎక్కువగా ఉగాది రోజున తయారు చేసుకొని తింటారు. ఈ రెసిపీ ప్రస్తుతం గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇది ఒక సంప్రదయ పచ్చడి.
పంచామృతం: పంచామృతం అనేది భారతీయులు దేవతలకు ప్రతిరోజు నైవేద్యంగా తయారు చేసే రెసిపీ. ఇది ఎక్కువగా శివుడికి ప్రసాదంగా పెడుతారు. ఇది తయారు చేయడం ఎంతో సులభం. ఈ రెసిపీని కూడా 2024 సెర్చ్‌లో జాబితాలో ఉంది.
కొబ్బరి పచ్చడి: కొబ్బరి తురుము పచ్చడిని తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇది కర్ణాటక ప్రాంతా వారు ఎక్కువగా తింటారు. ప్రస్తుతం ఈ రెసిపీ కూడా గూగుల్ సెర్చ్‌లో స్థాన్నాని సంపాదించుకుంది.
కంజీ: కంజీ అనేది ఎంతో ప్రస్థిది చెందిన పానీయం. దీని ఎక్కువగా హోలీ సందర్భంలో తయారు చేస్తారు. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు ఇది ఆరోగ్యకరమైన ఆహారం కూడా ప్రస్తుతం ఈ రెసిపీ కూడా గూగుల్ సెర్చ్‌లో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.