Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. తాజాగా మంచు సోదరుల్లో చిన్నవాడైన మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనికా రెడ్డి ఇద్దరు త్వరలో పవన్ కళ్యాన్ కు చెందిన జనసేన పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం.
Manchu Family: మంచు సోదరులు వివాదాం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గత వారం మొత్తం మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలే హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ ను మించిన ట్విస్టులతో వీరి కుటుంబ వ్యవహారం రచ్చ కెక్కింది. తాజాగా మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు.
నేడు ఆళ్లగడ్డలో మౌనికా రెడ్డి అమ్మగారైన శోభా నాగిరెడ్డి జయంతి. ఈ వేడుకల్లో పాల్గొన్న తర్వాత దాదాపు 1000 కార్లలతో ఆళ్ళగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అక్కడ భూమా దంపతుల ఘాట్ లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయనున్నారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఆస్తి వివాదం నేపథ్యంలో రచ్చ కెక్కిన మంచు మనోజ్.. పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీలోకి వెళ్లాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మొత్తంగా మంచు మనోజ్ రాజకీయ ఆరంగేట్రం మంచు ఫ్యామిలీలో కొత్త టర్న్ తీసుకుంటున్నదనే చెప్పాలి. అంతేకాదు తాజాగా తన ఇంట్లో జరిగిన వివాదంతో మంచు మనోజ్ బాధితుడిగా మిగిలాడు.
మొత్తంగా ఈ ఎపిసోడ్ మొత్తంలో మంచు విష్ణునే విలన్ గా నిలిచాడు. . తాజాగా జరిగిన వివాదంతో రాజకీయంగా బలపడాలనే నిర్ణయానికి మంచు మనోజ్ దంపతులు వచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు మౌనిక వాళ్ల అమ్మ శోభా నాగిరెడ్డి గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ పార్టీల్లో పనిచేసారు. అంతేకాదు 2009లో ప్రజారాజ్యం తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు భూమా నాగిరెడ్డి కూడా టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీల్లో కొనసాగారు. అప్పట్లో పలుమార్లు ఎమ్మెల్యేగా, నంద్యాల ఎంపీగా పనిచేసిన ట్రాక్ రికార్డు ఉంది.
మొత్తంగా రాయలసీమలో మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో మంచు మనోజ్ తన భార్యతో కలిసి జనసేన పార్టీలో చేరుతుండంతో రాయలసీమలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలున్నాయనేది సమాచారం.