SBI Clerk Jobs 2024: బ్యాంకు జాబ్ చేయాలనే కలలు కంటున్నారా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చేస్తున్న ఎస్బీఐ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,735 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావలసిన వివరాలు తెలుసుకుందాం..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.sbi.co.in ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ అర్హతతో ఈ క్లర్క్ జాబులు పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎస్బీఐ క్లారికల్ నోటిఫికేషన్ డిసెంబర్ 17 ఈ రోజున విడుదల అయింది. చివరి తేదీ 2025 జనవరి 7 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. 1996 కు ముందు పుట్టిన వారు అనార్హులు.
ఈ పోస్ట్ ఎస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.sbi.co.in/careers పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత లేటెస్ట్ అనౌన్స్మెంట్ లేదా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ క్లర్క్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి
అక్కడ అప్లై ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి
ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే వెంటనే 'న్యూ రిజిస్ట్రేషన్' పై ఎంపిక చేసుకొని అందులో మీ బేసిక్ వివరాలను పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి వంటివి నమోదు చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ పూర్తిగా ఫీల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కావాల్సిన డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా మీ డీటెయిల్స్ ని డబుల్ చెక్ చేసుకోవాలి... ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు మీ ప్రింట్ అప్లికేషన్ ఫారం కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
ఇదీ చదవండి: త్వరపడండి.. జియో ఈ 84 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితం..
2025 జనవరి 7వ తేదీ వరకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఆ పాసైన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ మార్చి లేదా ఏప్రిల్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు ఎగ్జామినేషన్లు ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో మీరు లోకల్ లాంగ్వేజ్ కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.. తెలుగులో కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఇందులో ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్ 100 మార్కులకు నిర్వహిస్తారు. సమయం ఒక గంట ఉంటుంది. అంటే వంద మార్కులు ప్రశ్నకు 60 నిమిషాలు సమయం ఉంటుంది. విద్యార్థులు ఇతర వివరాల కోసం ఎస్బీఐ అధికారి వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి...
ఇదీ చదవండి: ధాన్యలక్ష్మి పేరు చెబితేనే వణికిపోతున్న కావ్య.. అయ్యయ్యో గుండెనొప్పితో కుప్పకూలిన అమ్మమ్మ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.