Saphala Ekadashi tradition 2024: మార్గశిర మాసం కూడా శ్రీమహా విష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా చెప్తుంటారు. ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా శ్రావణం, కార్తీకం, మార్గశిర మాసాలో వచ్చే ఏకాదశి తిథి పర్వదినాలు.. శివ, కేశవులకు ఎంతో ఇష్టమైన తిథులుగా చెప్తుంటారు. ఈ మాసంలో ముఖ్యంగా ధనుర్మాసం తిరుప్పావ్ ఉత్సవాలు జరుగుతుంటాయి. విష్ణుదేవుడిని ప్రత్యేకంగా పాశురాలతో పూజిస్తుంటారు. అయితే.. ప్రస్తుతం డిసెంబరు 26న సఫల ఏకాదశి జరుపుకోనున్నాం.ఈ పేరుకు.. సఫల అని ఉంది. అంటే.. ఈ ఏకాదశి రోజు మనం ఏ పనిఆచరించిన , కూడా అది వెంటనే సఫలమైతుందంట.
అదే విధంగా శ్రీమన్నారయణుడికి కూడా ఈ తిథి అంటే ఇష్టమని చెప్తుంటారు. అందుకు చాలా మంది ఈ ఏకాదశి రోజు పూజలు వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఈరోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అమోఘమైన తిథి ఉంది. విష్ణు భగవానుడ్ని ఆరాధించే వారు.. ఈ రోజున దగ్గరలోని ఆలయాలకు వెళ్లి నెయ్యితో దీపారాధన చేయాలి. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి.. ఒక ఐదురకాల పూలను సమర్పించాలని పండితులు చెప్తుంటారు.
ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే.. ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందంట. అంతేకాకుండా. .తెలిసీ.. తెలియక చేసిన పాపాలన్ని కూడా పటా పంచలౌతాయని కూడా పండితులు చెబుతుంటారు. అందుకే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైందని చెప్తుంటారు. ఒక వైపున ప్రస్తుతం ధనుర్మాస ఉత్సవాలు, మరొవైపున సఫలా ఏకాదశి కూడా రావడంతో పండితులు, ఇది ఎంతో శుభమైన పరిణామం అని చెప్తున్నారు.
ఈ వేడుకల నేపథ్యంలో ధనం గురించి బాధపడేవారు.. పెళ్లి కానీ వారు.. సంతానం లేని వారు సత్యనారాయణ వ్రతాలు పూజాలు ఆచరిస్తే.. వారి కోరికలు మాత్రం వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సఫలా ఏకాదశి రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలని కూడా పండితులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.