Laapatha Ladies Oscar: మరోసారి ఆస్కార్ లో భారతీయ సినిమాకు నిరాశే.. లాపతా లేడీస్ కు దక్కని చోటు..

Laapatha Ladies Oscar: మరోసారి ఆస్కార్ బరిలో భారతీయ సినిమాకు నిరాశే ఎదురైంది. ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను 2025 ఆస్కార్ తరుపున మన దేశం నుంచి ఎంపికైంది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ‘లాపతా లేడీస్’ సినిమాకు చోటు దక్కలేదు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 10:47 AM IST
Laapatha Ladies Oscar: మరోసారి ఆస్కార్ లో భారతీయ సినిమాకు నిరాశే.. లాపతా లేడీస్ కు దక్కని చోటు..

 Laapatha Ladies Oscar: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సినీ ప్రేమికులు ఎదరు చూసే అవార్డుల్లో ఆస్కార్ కు ప్రథమ స్థానం ఉంటుంది. అంతేకాదు మన దేశంలో చాలా మంది సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు జీవితంలో ఒక్కసారైనా తమ సినిమాకు ఆస్కార్ రావాలని కోరుకుంటారు. అది అంతా ఈజీ కాదు. మన దేశంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు  బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే కదా. దీంతో భారతీయ ప్రేక్షకులు పులకించిపోయారు.

తాజాగా 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ ను కాసేటి క్రితమే అకాడమీ వాళ్లు అనౌన్స్ చేశారు. ఇందులో కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ (Laapatha Ladies) మన దేశం తరుపున ఆస్కార్ కు నామినేట్ అయింది. కానీ షార్ట్ లిస్ట్ లో ఈ సినిమాకు చోటు దక్కలేదు. దీంతో సినీ ప్రేమికులు ఒకింత నిరాశకు గురయ్యారు.

‘లాపతా లేడీస్’ను ప్రమోట్ చేయడానికి ఆమీర్ ఖాన్, కిరణ్ రావు లు ఎంతో కష్టపడ్డారు.  ‘లాపతా లేడీస్’ అంటే.. కనిపించకుండా పోయిన మహిళలు అనే అర్ధం. ఈ సందర్బంగా ప్రముఖ హాలీవుడ్ మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.  ఈ సినిమా విషయానికొస్తే.. ఒక ఊళ్లో పెళ్లి చేసుకొని అత్తవారింటికి తన భర్తతో కలిసి ట్రెయిన్ లో వెళుతుంది. ఈ సందర్భంగా పెళ్లి కుమారుడు తన ఊరి స్టేషన్ వచ్చిందనుకొని తన భార్యతో కలిసి రైలు దిగుతాడు. కానీ అతని వెంబడి అతని భార్య కాకుండా వేరే వాళ్ల భార్య ఉంటుంది. ముసుగు కప్పడంతో కనిపెట్టలేకపోతాడు.  ఈ సందర్భంగా తన అత్తారింటి అడ్రస్.. తన పుట్టింటికి సంబంధించి చిరునామా తెలియకపోవడంతో ఆ పెళ్లి కూతురు ఒక స్టేషన్ లో ఒక హోటల్ నిర్వాహకురాలిగా దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఈ సందర్బంగా తప్పిపోయిన ఆ మహిళ తిరిగి తన భర్త దగ్గరకు ఎలా చేరిందనేదే ‘లాపతా లేడీస్’ స్టోరీ. ఈ సినిమాలో మహిళల ఆర్ధిక స్వేచ్ఛ, స్వావలంభన, తమ భవిష్యత్తు పూర్తి నిర్ణయాధికారం నేపథ్యంలో తెరకెక్కింది. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరు భావించారు. కానీ తీరా నిరాశే మిగిలింది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనుంది.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News