Oscar 2025 santosh: భారత దేశం తరుపున ప్రతి యేడాది ఒక సినిమా అధికారిక ఎంట్రీగా వెళుతూ ఉంటుంది. కానీ ఏ సినిమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ కూడా కాదు. అప్పట్లో మన దేశం తరుపున ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయ్యాయి. కానీ వేటికి అవార్డులు రాలేదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రం ప్రైవేటుగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది. అంతేకాదు ఆస్కార్ బరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచింది. మన దేశం నుంచి పూర్తి భారతీయులు రూపొందించిన ఓ సినిమాకు ఆస్కార్ రావడం అదే తొలిసారి.
అయితే 2025 యేడాదిగాను మన దేశం తరుపున ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ మూవీ ఆస్కార్ కు పంపారు. కానీ అక్కడ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు. కానీ భారతీయ నటిమణి షహనా గోస్వామి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘సంతోష్’ (Santosh)సినిమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయింది. ఢిల్లీలో పుట్ిన షహనా గోస్వామి హిందీ చిత్రాలతో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు. ఆమె లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ‘సంతోష్’ అనే హిందీ మూవీ యునైటైడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తరుపున షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.
‘సంతోష్’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని సంధ్యా నూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు ఆకాశానికి ఎత్తేసారు. ఈ సినిమా ఆస్కార్ షార్ట్ లిస్టులో స్థానం దక్కడంపై షహనా గోస్వామి మాట్లాడుతూ.. మా సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ కు సెలెక్ట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి స్టోరీ లైన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సినిమా ఆస్కార్ కు సెలెక్ట్ అయినందుకు షహనాకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఆస్కార్ బరిలో విజేతగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.