Love Fraud: లవ్‌ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'

Malaysia Woman Loses Rs 4 Crore Online Love: ఆన్‌లైన్‌లో ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. తీరా అది మోసమని గ్రహించేలోపు ఓ ఆంటీ రూ.4 కోట్ల డబ్బులు మోసపోయింది. ఆన్‌లైన్‌ మోసానికి బలైన ఆంటీ కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 18, 2024, 05:51 PM IST
Love Fraud: లవ్‌ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'

Online Love Fraud: ప్రేమ మైకంలో తమ ప్రియులు అడిగిందల్లా ఇచ్చేయడం.. తీరా వాళ్లు మోసం చేసి వెళ్లిపోవడంతో లబోదిబోమనే సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రియురాలు తన ప్రియుడిని కలుసుకోకుండానే ఏడేళ్లుగా ప్రేమించుకుంటూ ఉండి అతడు అడిగినంత డబ్బులు పంపిస్తూ నిండా మోసపోయింది. తీరా ప్రియుడు పత్తా లేకుండా పోవడంతో ఆమె ఖంగుతిని పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Spy Camera: మహిళా టీచర్ల బాత్రూమ్‌లో రహాస్య కెమెరా.. స్కూల్‌ డైరెక్టర్‌ నీచపు పని

మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన 67 ఏళ్ల పెద్దావిడకు ఏడేళ్ల కిందట ఒకాయన ఫేసుబుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. మాటా మాట కలవడంతో మాట్లాడేసుకున్నారు. తాను వైద్య పరికరాల వ్యాపారం అమెరికాలో చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. నెల రోజుల వారి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. తరచూ ఫోన్లు మాట్లాడుకోవడం.. వీడియో కాల్స్‌ ఇలా కొనసాగుతున్నాయి. కొన్నాళ్లకు సింగపూర్‌లో కూడా తన వ్యాపారం విస్తరించాలని చూస్తున్నట్లు ఆమెతో చెప్పుకున్నాడు. దీనికోసం రవాణా ఖర్చులు.. ఇతర వాటికోసం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ విషయంలో సహాయం చేయాలని కోరగా ఆమె 5 వేల మలేషియన్‌ కరెన్సీ పంపించింది.

Also Read: Insta Reel: వ్యూస్‌ కోసం రోడ్డుపై రూ.25 వేలు.. 'మనీ హంటింగ్‌‌' ఆట కట్టించిన పోలీసులు

ఇలా ఆమెను తరచూ వివిధ కారణాలు చెప్పి డబ్బులు అడుగుతూ వచ్చాడు. దాంతోపాటు ఆమెతో ఆన్‌లైన్‌ వేదికగా అనుబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇలా 306 బ్యాంక్‌ ఖాతాలకు డబ్బులను బదిలీ చేయించుకున్నాడు. అలా ఏడేళ్లలో రూ.4 కోట్ల వరకు డబ్బులు ఆమె నుంచి దండుకున్నాడు. కొన్నాళ్లకు అతడి నుంచి ఎలాంటి సందేశం కానీ.. వీడియో కాల్స్‌ కానీ రాలేదు. ఈ విషయాన్ని బాధితురాలు తన స్నేహితులతో చెప్పగా.. 'నువ్వు మోసపోయావు. అతడు స్కామర్‌' అని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయించింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రేమ పేరిట చేసే చాటింగ్‌, వీడియో కాల్స్‌, నగదు లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మలేషియా పోలీసులు సూచించారు.

అయితే ఇక్కడ వారిద్దరూ దాదాపు ఏడేళ్లు ఆన్‌లైన్‌ వేదికగా మాట్లాడుకోవడం విశేషం. నిత్యం ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌తో తమ అనుబంధాన్ని పెంచుకున్నారు. కానీ వీరిద్దరూ ఏనాడు భౌతికంగా కలవలేదు. ఏడేళ్లలో ఒక్కసారి కూడా వీరు ఒకరికొకరు నేరుగా కలుసుకోకపోవడంతో ఈ వార్త నెట్టింట్‌లో వైరల్‌గా మారింది. అలా ఎలా బ్రో అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News