Diabetes Remedies: మధుమేహం అనేది మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అతి తీవ్రమైన సమస్యగా మారింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్లమంది మధుమేహం వ్యాధిగ్రస్థులున్నారు. అయితే మధుమేహం ఉంటే కచ్చితంగా రక్తపోటు సమస్య ఉంటుందంటారు. మధుమేహానికి రక్తపోటుకు సంబంధమేంటి, ఎలాంటి వ్యాధులకు దారితీస్తుందనేది చూద్దాం.
రక్తంలో చక్కెర స్థాయి పెరగడమే డయాబెటిస్. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే గుండె, కిడ్నీ వ్యాధులతో పాటు చర్మం, రక్తపోటుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ కధనం ప్రకారం మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో 50-70 శాతం మందికి అధిక రక్తపోటు ఉందని తేలింది. డయాబెటిస్ రోగులకు రక్తపోటు రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఇన్సులిన్ నిరోధకత ఉండటం వల్ల ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి కాకపోవడంతో రక్తపోటు పెరుగతుంది. అదే సమయంలో డయాబెటిస్ రోగులకు బరువు పెరగడం గమనించవచ్చు. ఇది కూడా హై బీపీకు కారణమౌతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైనప్పుడు నరాలు దెబ్బ తిని బీపీ పెరుగుతుంది. రక్తం ప్రవహించే సిరలు కుదించుకుపోవడంతో రక్త ప్రసరణలో ఇబ్బంది తలెత్తి బీపీ సమస్య రావచ్చు.
అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు ముందుగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. స్థూలకాయం రాకుండా బరువు పెరగకుండా చూసుకోవాలి. స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఈ ఆంక్షలు పాటిస్తూనే హెల్తీ డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయల్ని డైట్లో చేర్చాల్సి ఉంటుంది. ఉప్పు అతిగా తీసుకోకూడదు. సాధ్యమైనంతవరకూ దూరం పెడితే మంచిది. మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలి.
Also read: TG TET Schedule: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.